Hyderabad: రూ.కోటి కొల్లగొట్టి.. చైనా వాడికి దోచిపెట్టి..
ABN, Publish Date - Aug 23 , 2025 | 07:30 AM
సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి చైనా క్రిమినల్‌కు దోచిపెట్టిన ఆరుగురు తెలుగు సైబర్ నేరగాళ్లను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకకు చెందిన 34ఏళ్ల బాధితురాలికి ఇన్‌స్టాలో, వాట్సాప్‌లో టెలీగ్రామ్‌లో మెసేజ్‌లు వచ్చేవి.
- కమీషన్ల కోసం సైబర్ నేరాలు..ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్ సిటీ: సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి చైనా క్రిమినల్‌కు దోచిపెట్టిన ఆరుగురు తెలుగు సైబర్ నేరగాళ్లను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు(City Cyber Crime Police) కటకటాల్లోకి నెట్టారు. సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకకు చెందిన 34ఏళ్ల బాధితురాలికి ఇన్‌స్టాలో, వాట్సాప్‌లో టెలీగ్రామ్‌లో మెసేజ్‌లు వచ్చేవి. వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో ఆన్‌లైన్‌లో చిన్న చిన్న టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చని నమ్మబలికారు.
నిజమని నమ్మిన బాధితురాలు వారిని కాంటాక్టు అయింది. ఆ తర్వాత టాస్క్‌లు పూర్తి చేస్తున్న క్రమంలోనే ట్రేడింగ్ లింకులు పంపేవారు. వీటిలోనూ చిన్నమొత్తాల్లో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు ఉంటాయని బురిడీ కొట్టించారు. దాంతో ఆమె వాటిలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. ప్రారంభంలో మంచి లాభాలు అందుకుంది. అలా మెల్లగా ఊబిలోకి దింపిన నేరగాళ్లు ఆమెతో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టించారు.
విత్‌డ్రా ఆప్షన్ క్లోజ్ చేశారు. ఆన్‌లైన్‌లో రూ. కోట్లలో లాభాలు వచ్చినట్లు చూపించారు. ఇలా ఆమెతో రూ. 1.05కోట్లు పెట్టుబడి పెట్టించిన క్రిమినల్స్.. రూ. 6కోట్ల వరకు లాభాలను వర్చువల్‌గా చూపించి డబ్బులను విత్‌డ్రా చేసుకోకుండా ముప్పుతిప్పలు పెట్టారు. మోసమని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో అదంతా నకిలీ ట్రేడింగ్ లింకులుగా పోలీసులు గుర్తించారు.
కమీషన్‌కు కక్కుర్తిపడి..
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్‌కు చెందిన ఎద్దులపూరి హర్షవర్థన్, కొండూరు వేణు, మైలారం ప్రదీప్, పచ్చిపాల వినోద్ యాదవ్, పరసనబోయిన వంశీ, మంగళి లక్ష్మణ్ ముఠాగా ఏర్పడినట్లు గుర్తించారు. చైనా దేశం నుంచి ఆన్‌లైన్‌లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న క్రిమినల్ చెన్ చెన్‌కు ఈ ముఠా సహకారం అందిస్తోంది. నేరగాళ్లకు అవసరమైన బ్యాంకు ఖాతాలు ఇవ్వడం,
ఆయా ఖాతాలకు బదిలీ అయిన డబ్బును సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లైన వేణు, హర్షవర్థన్ క్రిప్టో కరెన్సీగా మార్చి ఆ డబ్బును చైనాకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. అందుకు చైనా క్రిమినల్ నుంచి ప్రతి లావాదేవీకి 5 శాతం కమీషన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు సైబర్ నేరగాళ్లకు 50 బ్యాంకు ఖాతాలు సరఫరా చేసినట్లు తేలింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Aug 23 , 2025 | 07:30 AM