Gold Rates Aug 23: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Aug 23 , 2025 | 06:46 AM
నేటి బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు, శుభకార్యాలకు నగలు కొనేందుకు ఇది మంచి సమయం అని నిపుణులు చెబుతున్నారు. మరి వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సువర్ణావకాశం. దేశంలో బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,00,520గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.92,140గా ఉంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్‌ల బంగారం ధర రూ.75390గా ఉంది. కిలో వెండి ధర స్వల్పంగా పెరిగి రూ.1,18,100కు చేరుకుంది. ప్లాటినం ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల ప్లాటినం ధర ప్రస్తుతం రూ.37,720గా ఉంది. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ అవకాశాలు తగ్గాయన్న భావనతో బంగారానికి డిమాండ్ తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, డాలర్ బలపడం కూడా బంగారానికి డిమాండ్ తగ్గిస్తోంది. ఇక భారత్‌లో అనేక మంది ట్రేడర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడం కూడా బంగారం ధరలు దిగొచ్చేలా చేస్తోంది.
వివిధ నగారాల్లో బంగారం (24కే,22కే,18కే) ధరలు ఇలా..
చెన్నై: ₹1,00,520; ₹92,140; ₹76,190
ముంబయి: ₹1,00,520; ₹92,140; ₹75,390
ఢిల్లీ: ₹1,00,670; ₹92,290; ₹75,510
కోల్‌కతా: ₹1,00,540; ₹92,140; ₹75,390
బెంగళూరు: ₹1,00,520; ₹92,140; ₹75,390
హైదరాబాద్: ₹1,00,520; ₹92,140; ₹75,390
కేరళ: ₹1,00,580; ₹92,140; ₹75,390
పుణె: ₹1,00,520; ₹92,140; ₹75,390
వడోదరా: ₹1,00,570; ₹92,190; ₹75,430
అహ్మదాబాద్: ₹1,00,570; ₹92,190; ₹75,430
వివిధ నగరాల్లోని వెండి ధరలు
చెన్నై: ₹1,28,100
ముంబయి: ₹1,18,100
ఢిల్లీ: ₹1,18,100
కోల్‌కతా: ₹1,18,100
బెంగళూరు: ₹1,18,100
హైదరాబాద్: ₹1,28,100
కేరళ: ₹1,28,100
పుణె: ₹1,18,100
వడోదరా: ₹1,18,100
అహ్మదాబాద్: ₹1,18,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
ఇండియాలోకి ఓపెన్ ఏఐ.. త్వరలో కొత్త యూనిట్ ప్రారంభం..!
కోఆపరేటివ్ బ్యాంకులకూ పూర్తిస్థాయి ఆధార్ ఆథెంటికేషన్ సేవలు.. యూఐడీఏఐ నిర్ణయం