Hyderabad: ఈ కర్నూలు కుర్రోడు మామూలోడుకాదుగా.. ఏం చేశాడో తెలిస్తే...
ABN, Publish Date - Nov 27 , 2025 | 09:56 AM
తానొక ఐఏఎస్ అధికారినంటూ పలువురి వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్ అనే వ్యక్తి తాను ఐఏఎస్ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. చివరకు ఆయన పాపం పండి పోలీసులకు దొరికిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.
- గన్‌మెన్‌లు.. వాకీటాకీలు.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారిగా వ్యక్తి హల్‌చల్
- పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి మోసం
హైదరాబాద్ సిటీ: ప్రైవేటు గన్‌మెన్‌లను ఏర్పాటు చేసుకొని, వాహనానికి సైరన్, వాకీటాకీ పెట్టుకొని ఐఏఎస్(IAS) అధికారినంటూ మోసాలు చేస్తున్న వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు(Filmnagar Police) అరెస్ట్ చేశారు. వెస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో బుధవారం డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఉమ్మడి కర్నూలు(Kurnool) జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్ (35) కొంతకాలం క్రితం నగరానికి వచ్చాడు. 3డీ యానిమేషన్ కోర్సు పూర్తి చేసుకున్నాడు. నేర్చుకున్న టెక్నాలజీని వినియోగించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసుకున్నాడు.
తమిళనాడు(Tamil Nadu)కు చెందిన విశ్రాంత సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ప్రవీణ్, విమల్‌ను గన్‌మెన్‌లుగా నియమించుకున్నాడు. షేక్‌పేట(Sheakpet)లోని అపర్ణ ఔరా అపార్ట్‌మెంట్‌లో మకాం పెట్టి పలువురిని అధికారినంటూ నమ్మించాడు. టీఎస్ఐఐసీలో ఉన్న ఖాళీ స్థలంలో పరిశ్రమల ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పి అలీ హసన్ నుంచి రూ.10.50 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.10 లక్షలు వసూలు చేశాడు. బాధితులు మోసం గ్రహించి ఫిర్యాదు చేయడంతో శశికాంత్‌ను అరెస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 27 , 2025 | 09:56 AM