Hyderabad: నగరంలో.. విదేశీ మహిళలతో వ్యభిచార దందా
ABN, Publish Date - May 16 , 2025 | 12:01 PM
నగరంలో.. విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ గోపాలపురం పరిధిలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాహాకులను అదుపులోకి తీసుకున్నారు.
- ముఠా ఆటకట్టించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
- ముగ్గురు నిందితులు, ఇద్దరు మహిళా సప్లయర్స్ అరెస్టు
- ఇద్దరు బంగ్లాదేశ్ యువతులను రక్షించిన పోలీసులు
హైదరాబాద్ సిటీ: ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి అక్రమంగా నగరానికి వలస వచ్చి.. సికింద్రాబాద్(Secundrabad) పరిధిలో గుట్టుగా వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ముగ్గురు నిందితులను, ఇద్దరు మహిళా సప్లయర్స్‌ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి చెర నుంచి ఇద్దరు బంగ్లాదేశీ యువతులను రక్షించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మాజీఎంపీ మధుయాష్కీ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..
టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుదీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ గోపాలపురం పరిధిలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆకస్మిక దాడి చేసిన పోలీసులు పశ్చిమబెంగాల్‌కు చెందిన బిమల్‌సేన్ అలియాస్ సుబ్రతా, బంగ్లాదేశ్‌కు చెందిన సకిల్ హుస్సేన్ అలియాస్ ముల్లా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కస్టమర్ ఎస్‌ఎ నజీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి అదుపులో ఉన్న బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు యువతులను రక్షించి హోమ్‌కు తరలించారు. వారితో పాటు.. ముఠాలో ఉన్న మరో ముగ్గురు బంగ్లాదేశ్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు. బిమల్ సేన్ అలియాస్ సుబ్రతా కొంత కాలం క్రితం పశ్చిమబెంగాల్ నుంచి బతుకుదెరువుకోసం వచ్చి సికింద్రాబాద్‌లో ఉంటూ వ్యభిచార గృహాన్ని నడుపుతున్నాడు.
ఇద్దరు మహిళా సప్లయర్స్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమంగా ఇండియాకు రప్పించి పశ్చిమబెంగాల్‌కు చెందిన మధ్యవర్తుల ద్వారా హైదరాబాద్(Hyderabad)కు దిగుమతి చేసుకుంటున్నాడు. బతుకుదెరువు చూపిస్తామని చెప్పి చీకటి దందాలోకి దింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గోపాలపురం పోలీసులు నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు ఢమాల్.. లక్ష నుంచి దిగజారుతూ..
తెలంగాణలో 22కోట్ల ఏళ్ల నాటి రాక్షసబల్లి అవశేషాలు
పకృతి విధ్వంసానికి సీఎందే బాధ్యత: కేటీఆర్
ఆర్టీసీ సీసీఎస్‌లో 15 రోజుల్లోగా రూ.1,029 కోట్లు జమ చేయాలి
Read Latest Telangana News and National News
Updated Date - May 16 , 2025 | 12:03 PM