Hyderabad: మాట్లాడుదామని షాపునుంచి బయటకు పిలిచి..
ABN, Publish Date - May 03 , 2025 | 08:11 AM
ఓ వ్యక్తిని మాట్లాడుదామని షాపునుంచి బయటకు పిలిచి.. కత్తులతో పొడిచి చంపిన సంఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. స్థానికంగా సంచలనం కలిగించిన ఈ ఘటనలో హతుడు ఓ పాన్‌షాప్ నిర్వాహిస్తున్న మహమ్మద్ మాజిద్‌గా గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
- పాన్‌షాప్ నిర్వాహకుడి హత్య
హైదరాబాద్: గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి ఓ పాన్‌షాప్ నిర్వాహకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్(Falaknuma Police Station) పరిధిలో జరిగింది. వట్టేపల్లి(Vaddepalli)కి చెందిన మహమ్మద్ మాజిద్ (25) తీగలకుంటలో పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ విద్యుత్ మీటర్లు కాంట్రాక్టర్ ఇంట్లో ఎందుకున్నాయో..
శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాజిద్‌ను షాపునుంచి బయటికి పిలిపించుకుని మాట్లాడారు. ఈ సమయంలో వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వారు కత్తితో అతన్ని దారుణంగా పొడిచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే చనిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..
Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్
Kishan Reddy: ఓల్డ్ సిటీకీ నిధులు కేటాయించాలి
పెద్దపల్లి ఎయిర్‌పోర్టు.. బసంత్‌నగర్‌లో కాదు.. అంతర్గాంలో!
Read Latest Telangana News and National News
Updated Date - May 03 , 2025 | 08:11 AM