Secunderabad: విశాఖపట్నం టు ఢిల్లీ.. వయా సికింద్రాబాద్..
ABN, Publish Date - Dec 19 , 2025 | 06:52 AM
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి 44.854 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- రైల్వేస్టేషన్‌లో 44.854 కిలోలు పట్టివేత
సికింద్రాబాద్: రైల్వే స్టేషన్‌లో గంజాయి సరుకుతో ఢిల్లీ(Delhi)కి వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 44.854 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్‌లో గురువారం సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ జావెద్, రైల్వే ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఢిల్లీ మదన్‌పూర్ ఖాదర్ జేజే కాలనీ ప్రాంతానికి చెందిన మింటు (29) డెకరేషన్ పనిచేస్తుంటాడు. జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం ఢిల్లీలో గంజాయి విక్రయించేవాడు.
గంజాయి విక్రయం కేసులో మింటు పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చినా మారలేదు. డబ్బు సంపాదన కోసం ఢిల్లీలోని తన ప్రాంతానికి చెందిన స్నేహితుడు నూరె అలం (22)ను కలిసి ఢిల్లీలో గంజాయి విక్రయిద్దామని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం ఢిల్లీలో ఉన్న రహమాన్‌ను కలిసి విశాఖపట్నం(Visakhapatnam) నుంచి గంజాయి తెస్తామని మాట్లాడుకున్నారు. ఇద్దరు ఈ నెల 7న ఢిల్లీ నుంచి విశాఖపట్నం, అక్కడి నుంచి విజయనగరం వెళ్లారు.
ఈ నెల 16న విజయనగరంలో 44.854 కిలోల గంజాయి కొనుగోలు చేసి అక్కడి నుంచి విశాఖపట్నం మీదుగా సికింద్రాబాద్‌కు రైలులో తీసుకొచ్చారు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా రైల్వే పోలీసుల తనిఖీలో వారు పట్టుబడ్డారు. గంజాయిని స్వాధీనం చేసుకోగా, ఈ కేసులో రెహమాన్ పరారీలో ఉన్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
టిక్కెట్ డబ్బులు వెనక్కి.. యూపీసీఏ నిర్ణయం
కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 19 , 2025 | 07:00 AM