SBI Home Loan Rates: ఎస్‌బీఐ కస్టమర్లకు పెద్ద షాక్.. హోం లోన్ వడ్డీ రేట్లు భారీగా పెంపు..
ABN, Publish Date - Aug 16 , 2025 | 08:26 PM
ఎస్‌బీఐ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. RBI రెపో రేటును తగ్గించినప్పటికీ కొత్త కస్టమర్లకు గృహ రుణాలపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. దీంతో గరిష్ఠ వడ్డీ రేటు 8.70 శాతానికి చేరుకుంది. ఈ మార్పు తక్కువ క్రెడిట్ స్కోర్‌లు ఉన్న కస్టమర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
పండుగ సీజన్‌లో ఇల్లు కొనాలని కలలు కనే కస్టమర్లకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ భారీ షాకిచ్చింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇటీవల ద్రవ్యోల్బణం నుండి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తూ రెపో రేటును 5.5%కి తగ్గించడం ద్వారా రుణాలను చౌకగా చేయడానికి ప్రయత్నించింది. కానీ, ఆశ్చర్యకరంగా దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కొత్త గృహ రుణ కస్టమర్లకు వడ్డీ రేట్లను 0.25% (25 బేసిస్ పాయింట్లు) పెంచింది. దీంతో గరిష్ఠ వడ్డీ రేటు 8.70 శాతానికి చేరుకుంది. ఈ మార్పు తక్కువ క్రెడిట్ స్కోర్‌లు ఉన్న కస్టమర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా హోం లోన్ పొందాలనుకునే కొత్త కస్టమర్లకు ఇది ఊహించని పరిణామమే.
కొత్త గృహ రుణాలపై ప్రభావం
SBI గృహ రుణ వడ్డీ రేట్లు గతంలో 7.50% నుంచి 8.45% మధ్య ఉండేవి. ఇప్పుడు ఈ పరిధిని 7.50% నుండి 8.70% కి పెంచారు. కానీ, బ్యాంక్ కనీస రేటును మార్చలేదు. దీని అర్థం క్రెడిట్ స్కోరు లేదా CIBIL స్కోరు బలహీనంగా ఉన్న కొత్త కస్టమర్లు ఇప్పుడు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, మంచి క్రెడిట్ స్కోరు ఉన్న కస్టమర్లు ఇప్పటికీ 7.50% ప్రారంభ రేటుతో రుణం పొందవచ్చు. ఆగస్టు 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్టు సమాచారం. అయితే ఈ పెంపు కొత్తగా రుణం తీసుకునే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.
ఇప్పటి వరకూ ఎస్‌బీఐ గృహ రుణాల వడ్డీరేట్లు తాజా పెంపుతో వాటి గరిష్ఠ పరిమితి 8.70% కి చేరింది. సిబిల్ స్కోరు, ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (EBLR) ఆధారంగా ఈ వడ్డీరేట్లు నిర్ణయించారు. సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నవారికి ఇకపై మరింత అధిక వడ్డీరేట్లు విధించే అవకాశం ఉంది. ఈ మార్పుల గురించి బ్యాంక్ అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వడ్డీ మార్పులు బ్యాంక్ మార్జిన్ పెంపు కోణంలో తీసుకున్న నిర్ణయం అని తెలుస్తోంది. ఇంతకముందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన హోమ్ లోన్ వడ్డీరేట్లను 7.35% నుంచి 7.45%కి పెంచింది. ఇప్పుడు ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో ఇతర బ్యాంకులూ తమ వడ్డీరేట్లను సమీక్షించే అవకాశం ఉంది.
Also Read:
గుడ్ న్యూస్.. వీటి ధరలు భారీగా తగ్గనున్నాయ్..
యూపీఐ యూజర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ తెరమరుగు
For More Business News and Telugu News..
Updated Date - Aug 16 , 2025 | 08:27 PM