ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AskDISHA 2.0: IRCTC ఏఐ చాట్-బాట్‌.. ఇకపై క్షణాల్లోనే ట్రైన్‌ టికెట్‌ బుకింగ్‌..!

ABN, Publish Date - May 31 , 2025 | 12:32 PM

IRCTC's Ask Disha 2.0: ఇప్పుడు ఎవరూ రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి IRCTC పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్‌లో వాయిస్‌ కమాండ్ ఇస్తే చాలు.. IRCTC ఏఐ చాట్-బాట్‌ టిక్కెట్ బుకింగ్స్, క్యాన్సిలింగ్ సహా పలు సేవలను చిటికెలోనే పూర్తి చేసేస్తుంది.

IRCTC Ask Disha 2.0 Chatbot For Train Ticket Booking

IRCTC Chatbot For Ticket Booking: రైలు ప్రయాణీకులు ఇకపై టికెట్ బుకింగ్ కోసం నానా అవస్థలు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రయాణీకుల సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడానికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఏఐ ఆధారిత వర్చువల్‌ అసిస్టెంట్‌ AskDISHA 2.0 ను ప్రారంభించింది. ఇది ఒక అధునాతన AI ఆధారిత చాట్‌బాట్. దీని సాయంతో రైలు ప్రయాణీకులు ఇప్పటి నుంచి టికెట్ క్యాన్సిలింగ్, రిఫండ్ సహా అనేక పనులను క్షణాల్లోనే పూర్తి చేసుకోవచ్చు. AskDISHA 2.0 బుకింగ్ పనులను సులభతరం, వేగవంతం చేస్తుంది. ఇప్పటివరకూ పాస్‌వర్డ్‌ల కారణంగా కస్టమర్లు పడుతున్న ఇబ్బందుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.


‘ఆస్క్‌ దిశా 2.0’ ఏఐ చాట్ బాట్ ఐఆర్‌సీటీసీ సేవలను మరింత సులభతరం చేయనుంది. ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టిన ఈ ఏఐ ఆధారిత అసిస్టెంట్ సేవల కోసం ప్రయాణీకులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ‘ఆస్క్‌ దిశా 2.0’ ఏఐ చాట్ బాట్ ద్వారా ఒకే ఒక్క క్లిక్ తో వేగంగా టికెట్ బుకింగ్, రీఫండ్, క్యాన్సిలేషన్ వంటి ఐఆర్‌సీటీసీ సేవలను పొందవచ్చు. అదీ కేవలం చాట్ లేదా వాయిస్ కమాండ్ ద్వారా. ఈ సదుపాయంతో రైలు ప్రయాణీకులకు ఇకపై ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్‌ గుర్తుపెట్టుకునే బాధ కూడా తప్పుతుంది.


IRCTC AI- ఆధారిత చాట్ బాట్ AskDISHA 2.0 ద్వారా ప్రయాణీకులు హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ లేదా ఇతర భాషలలో టికెట్ బుక్ చేసుకోవచ్చు. దీని కోసం, మీరు IRCTCలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. దీని తర్వాత OTPని నమోదు చేయడం చేస్తే మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. మరి, పాస్‌వర్డ్ లేకుండా టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి, రద్దు చేయడానికి సులభమైన చిట్కాలను తెలుసుకోండి.


AskDISHA 2.0 ఉపయోగాలు

  • ఈ ఏఐ అసిస్టెంట్ సాయంతో టెక్నాలజీలో తక్కువ అనుభవం ఉన్న వ్యక్తులు కూడా టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు.

  • బుకింగ్ ప్రతి దశలోనూ సహాయం చేస్తుంది.

  • ప్రయాణికుల సమాచారాన్ని సేవ్ చేయడం సులభం. తదుపరిసారి బుకింగ్‌ కూడా ఈజీగా పూర్తవుతుంది.

  • లావాదేవీ విఫలమైతే మీరు 15 నిమిషాలలోపు మళ్ళీ ప్రయత్నించవచ్చు.


AskDISHA 2.0లో టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి?

  • IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ తెరిచి ఆస్క్ DISHA ఆప్షన్‌కి వెళ్లండి.

  • చాట్ ప్రారంభించడానికి హలో లేదా టికెట్ బుక్ అని టైప్ చేయండి లేదా వాయిస్ కమాండ్‌లను ఉపయోగించండి.

  • ఇప్పుడు మీరు స్టేషన్, తేదీ, తరగతి (ఉదా. స్లీపర్, 3AC) వంటి వివరాలను అందించాలి.

  • అసిస్టెంట్ మీకు రైలు జాబితా, సమయాలు, సీట్ల వివరాలను చూపుతుంది.

  • మీకు నచ్చిన రైలు, తరగతిని ఎంచుకోండి.

  • OTP ధృవీకరణ ద్వారా బుకింగ్‌ను పూర్తి చేయండి.


రీఫండ్ స్టేటస్ ఎలా తనిఖీ చేయాలి?

  • IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో Ask DISHA తెరవండి.

  • రీఫండ్ స్టేటస్ అని టైప్ చేయండి లేదా వాయిస్ కమాండ్ ఇవ్వండి.

  • రీఫండ్ టైప్ సెలక్ట్ చేసుకోండి.

  • టికెట్ రద్దు, విఫలమైన లావాదేవీ, టికెట్ డిపాజిట్ రసీదు (TDR), PNR నంబర్ ఎంటర్ చేయండి.

  • AskDISHA వెంటనే రీఫండ్ స్టేటస్ చూపుతుంది.


టికెట్ రద్దు ఎలా చేయాలి?

  • IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను తెరిచి Ask DISHA ఆప్షన్‌కి వెళ్లండి.

  • సెర్చ్ బార్ లో టికెట్ క్యాన్సిల్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.

  • మీ మొబైల్ నంబర్‌ ద్వారా లాగిన్ అవ్వండి.

  • బుక్ చేసుకున్న టిక్కెట్ల జాబితా కనిపిస్తుంది. మీరు రద్దు చేయాలనుకుంటున్నదాన్ని ఎంచుకోండి.

  • నిర్ధారణ తర్వాత టికెట్ రద్దు అయినట్లు SMS వస్తుంది.


ఇవీ చదవండి:

మరో షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్..ఆ సుంకం 50 శాతానికి పెంపు

ప్రమాదంలో ప్రజలు.. కోల్పోనున్న హిందూ కుష్ హిమాలయాలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 01:49 PM