Share News

Hindu Kush Himalayas: ప్రమాదంలో ప్రజలు.. 75 శాతం కోల్పోనున్న హిందూ కుష్ హిమాలయాలు

ABN , Publish Date - May 30 , 2025 | 07:11 PM

హిమాలయాల గురించి ఓ పరిశోధన నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. అధ్యయనాల ప్రకారం 21వ శతాబ్దం చివరి నాటికి 75 శాతం వరకు గ్లేసియర్ ఐస్‌ను (Hindu Kush Himalayas) కోల్పోవచ్చని తెలిపింది. గ్లోబల్ వార్మింగ్ ఇంకా ఇలాగే పెరిగితే డేంజర్ తప్పదని హెచ్చరించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Hindu Kush Himalayas: ప్రమాదంలో ప్రజలు.. 75 శాతం కోల్పోనున్న హిందూ కుష్ హిమాలయాలు
Hindu Kush Himalayas

ఇంటర్నెట్ డెస్క్: ఓ కొత్త శాస్త్రీయ అధ్యయనం షాకింగ్ విషయాలను ప్రకటించింది. దాదాపు రెండు బిలియన్ల మంది ప్రజలకు కీలకమైన నీటి వనరుగా ఉన్న హిందూ కుష్ హిమాలయాలు (Hindu Kush Himalayas).. ఈ శతాబ్దం చివరి నాటికి హిమానీనద ఐస్‌లో 75 శాతం వరకూ కోల్పోవచ్చని తెలిపింది. ఈ హెచ్చరిక ఆసియా అంతటా నీటి భద్రతపై కీలక పరిణామాలను సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ పెరిగి ముందుస్థాయిల కంటే 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే ఇది సాధ్యమవుతుందని పరిశోధన వెల్లడించింది. ఓ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయన ఫలితాలు, వాతావరణ చర్యలను మరింత వేగంగా బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశాయి.


గ్లోబల్ వార్మింగ్‌..

పారిస్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడంలో ఆయా దేశాలు విజయం సాధిస్తే 40 నుంచి 45 శాతం హిమానీనద ఐస్‌ను సంరక్షించవచ్చని అధ్యయనం అంచనా వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా, ఇది ప్రస్తుత హిమానీనద ద్రవ్యరాశిలో 54 శాతం నిలుపుకోవడానికి సహాయపడుతుంది. అయితే ప్రపంచం ప్రస్తుత 2.7 డిగ్రీల సెల్సియస్ వార్మింగ్ దిశగా కొనసాగితే కేవలం 24 శాతం మాత్రమే మిగులుతుంది. దీంతో యూరోపియన్ ఆల్ప్స్, ఉత్తర అమెరికా రాకీస్, ఐస్‌లాండ్ వంటి ప్రాంతాలు ప్రమాదంలో పడతాయని రీసెర్చ్ వెల్లడించింది.


ఈ అంశంపై చర్చ..

ఈ అధ్యయనం విడుదల సమయం మార్చి 2025లో తజికిస్తాన్‌లోని దుశాంబేలో ఐక్యరాష్ట్ర సమితి హిమానీనదాలపై తొలి సమావేశం జరిగింది. 50కి పైగా దేశాలు ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సమావేశమయ్యాయి. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు యింగ్‌మింగ్ యాంగ్, ఈ భేటీలో మాట్లాడుతూ కరిగే హిమానీనదాలు ఆసియాలో రెండు బిలియన్ల కంటే ఎక్కువ మంది జీవనోపాధిని ప్రమాదంలోకి పడేస్తాయన్నారు. వేడెక్కే ఉద్గారాలను తగ్గించడానికి సంప్రదాయ ఇంధన వనరులను వినియోగించాలన్నారు. ఇలా చేయడం ద్వారా హిమానీనదాలు కరిగే వేగాన్ని తగ్గించడానికి అవకాశం ఉందన్నారు.


ఫ్యూచర్ ఏంటి..

ఈ పరిశోధకులు 200,000కి పైగా హిమానీనదాల భవిష్యత్తును వివిధ వార్మింగ్ దృశ్యాలను అంచనా వేయడానికి ఎనిమిది హిమానీనద నమూనాలను వినియోగించారు. వారి విశ్లేషణ ప్రకారం, ఉష్ణోగ్రతలు స్థిరీకరించినప్పటికీ, హిమానీనద ద్రవ్యరాశి రాబోయే దశాబ్దాల్లో వేగంగా క్షీణిస్తుంది. దీర్ఘకాలిక ప్రభావాలు శతాబ్దాలపాటు కొనసాగుతాయని వెల్లడించింది. హిమానీనదాలు కేవలం అందమైన సహజ దృశ్యాలు మాత్రమే కాదు. ఇవి నీటికి జీవనాధారం. హిందూ కుష్ హిమాలయాలు గంగా, బ్రహ్మపుత్ర, సింధూ వంటి ఆసియాలోని ప్రధాన నదులకు నీటిని అందిస్తాయి. ఇవి వ్యవసాయం, జలవిద్యుత్, తాగునీటి అవసరాలకు కీలకంగా ఉపయోగపడుతున్నాయి. ఈ హిమానీనదాలు కరిగిపోవడం వల్ల నీటి కొరత, వరదలు, ఇతర వాతావరణ సంబంధిత విపత్తులు పెరిగే అవకాశం ఉంది.


ఇవీ చదవండి:

నీట్ పీజీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 07:47 PM