ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indrakeeladri Durga Devi: ఇంద్రకీలాద్రిలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం.. దుర్గమ్మని దర్శించుకుంటున్న భక్తులు

ABN, Publish Date - Jul 08 , 2025 | 07:25 AM

విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు జులై 8 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి.

Shakambari festival Vijayawada

విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు (Shakambari festival Vijayawada) ఇవాళ(మంగళవారం) ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు ఈరోజు(జులై 8) నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. శాకంబరీదేవి రూపంలో దుర్గమ్మని కూరగాయలతో విశేషంగా అలంకరించారు. భక్తులకు మూడు రోజుల పాటు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దుర్గమ్మ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారికి విరాళంగా భక్తులు కూరగాయలు సమర్పిస్తున్నారు. ఆలయం పరిసర ప్రాంతాలను కూరగాయలతో దేవాలయ అధికారులు ప్రత్యేకంగా అలంకరించారు.

ఆలయంలో బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 8:00లకు విఘ్నేశ్వరపూజ, రుత్విక్ వరుణం, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, అంకురార్పణ నిర్వహించనున్నారు. సాయంత్రం 4:00లకు కలశస్థాపన, అగ్నిప్రతిష్టాపన, మండపారాధన, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ జరుగనుంది. ఈ ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు విజయవాడ పోలీసులు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలకు ఆన్‌లైన్ బుకింగ్‌లో ఆలయ అధికారులు మార్పులు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం

వైభవంగా గంధ మహోత్సవం

Read latest AP News And Telugu News

Updated Date - Jul 08 , 2025 | 08:43 AM