MP Kesineni Sivanath: సుపరిపాలన 4 ఏళ్లు కొనసాగాలి
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:33 PM
Kutami Leaders: ఏపీలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సుపరిపాలన 4 ఏళ్ళు కొనసాగాలని కూటమి నేతలు ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయమని, కూటమి రాష్ట్రంలో 30 ఏళ్లు పరిపాలిస్తుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Amaravati: జూన్ 4వ తేదీ (June 4th) ఏపీ (AP)లో ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు.. రాష్ట్రంలో అరాచక పాలనకు బుద్ది చెప్పిన రోజు అయినందున బుధవారం సంబరాలు (Celebrations) చేయాలని క్యాడర్‌కు కూటమి నేతలు (Alliance parties) పిలుపిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకునేందుకు కూటమి నేతలు (Kutami Leaders) సిద్దమయ్యారు. అలాగే ఉదయం మహిళలకు రంగవల్లికల పోటీలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం టపాసుల మోతతో దీపావళి సంబరాలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మీడియాతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సుపరిపాలన 4 ఏళ్ళు కొనసాగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయమని, కూటమి రాష్ట్రంలో 30 ఏళ్లు పరిపాలిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అద్భుతంగా పరిపాలన..
ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఎంతో అద్భుతంగా పరిపాలన సాగిస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఐదేళ్ల రాక్షస పాలనకు ప్రజల చరమగీతం పాడారని, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఏడాది పూర్తి చేసుకుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.
అటువంటి వరవడిని మళ్ళీ తీసుకురావాలి..
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్థానం ఒక అంకిత భావంతో సాగిందని, సీఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ కొనియాడారు. ప్రతీ కార్యకర్త కష్టపడి ప్రతీ ఓటు వేయించారని.. ఈ సందర్భంగా అనేక మంది కేసులు పెట్టించుకున్నారని.. కొట్టించుకున్నారని.. అదే ఓపికతో విజయాన్ని అందించారని మంత్రి అన్నారు. విజయవాడ రాజకీయం ఎప్పుడు రాష్ట్ర రాజకీయాలు కీలక భూమిక పోషిస్తాయని, అటువంటి వరవడిని మళ్ళీ తీసుకురావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
రాష్ట్రం నుంచి జగన్‌ను బహిష్కరించాలి..
రౌడీ షీట్లర్లను విజయవాడ నగరం నుంచి బహిష్కరించినట్లుగా... జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృధికి అడ్డు పడేలా వ్యవహరించే వాళ్లకు ఈ రాష్ట్రంలో చోటు లేదన్నారు. పక్క రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్న జగన్ మోహన్ రెడ్డి అక్కడకే వెళ్ళాలని.. ఏపీని వదిలేయాలని అన్నారు. చంద్రబాబు పడి లేచిన కెరటమని, ఆయన దేశ రాజకీయాల్లో మకుటం లేని మహారాజు అని.. ఓడినా.. గెలిచినా.. రాజకీయాల్లో చిరస్థాయిగా చంద్రబాబు నిలిచిపోతారని అన్నారు. దేశంలో మోదీని రాష్ట్రంలో చంద్రబాబును ఎవ్వరు ఓడించలేరని.. అభివృద్ధిని అడ్డుకోలేరని.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం
For More AP News and Telugu News
Updated Date - Jun 04 , 2025 | 12:33 PM