Home » Kutami
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) కాకినాడలోని కలెక్టరేట్ లో ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన పవన్ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉప్పాడ(Uppada) మత్స్యకారుల సమస్యలపై చర్చించామని పవన్ కల్యాణ్ తెలిపారు.
తెలుగు భాషలో జాతీయ కవులు లేరా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు జాతీయ స్థాయి కవిగా జాషువా గుర్తుకు వస్తారని మాధవ్ తెలిపారు. ఆయన గబ్బిలం పేరుతో రచనలు చేస్తే.. దాని గురించి దేశ నలుమూలలను ప్రస్తావించారని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి వారికి ఘన స్వాగతం పలికారు.
CM Chandrababu: ప్రజలకు ఇచ్చిన 94 శాతం స్ట్రైక్ రేట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, ప్రజల్లో తృప్తి చూస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుందని సీఎం చంద్రబాబు నేతలను ఉద్దేశించి అన్నారు.
CM Chandrababu: 2019 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిచి ఉంటే.. రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదని, ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినవాళ్లకు.. కేవలం 11 సీట్లే వచ్చాయని అన్నారు.
Key Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఉదయం విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు అందరూ హాజరవుతున్నారు.
Kutami Leaders: ఏపీలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సుపరిపాలన 4 ఏళ్ళు కొనసాగాలని కూటమి నేతలు ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయమని, కూటమి రాష్ట్రంలో 30 ఏళ్లు పరిపాలిస్తుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
TDP vs YCP: 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనను ఓర్పుతో భరించిన ప్రజలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పారు. వైసీపీని ఓడించడమనే ఏకైక లక్ష్యంతో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ప్రజల్లో నిగూఢంగా దాగున్న వ్యతిరేకత బద్దలైంది. అది 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజున వెల్లడైంది.
AP News: కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. వైసీపీ మేయర్ సురేష్ బాబుల మధ్య గత కొంత కాలంగా కుర్చీ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సురేశ్ బాబు పదవి పోవడానికి ఈ వివాదమే కారణమని కడప ప్రజలు చర్చించుకుంటున్నారు.
క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పాస్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. వారికి ప్రతి నెల రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో 8 వేల మందికిపైగా పాస్టర్లకు లబ్ది చేకూరనుంది.