Anantapuram Sabha: పసుపు వనంగా అనంతపురం.. సభకు చేరుకున్న చంద్రబాబు, పవన్
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:02 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి వారికి ఘన స్వాగతం పలికారు.
అనంతపురం: జిల్లా కేంద్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ - సూపర్ హిట్ బహిరంగ సభకు భారీ ఎత్తున్న కూటమి శ్రేణులు తరలివస్తున్నారు. ఊరువాడా.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా.. సభకు కదిలారు. భారీగా జనాలు చేరుకోవడంతో విజయోత్సవ సభ అశేష జనంతో కిక్కిరిసిపోయింది. సభ ప్రాంగణమంతా జన సముద్రంగా మారిపోయింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా నడుస్తూ.. కూటమి శ్రేణులు సభకు చేరుకుంటున్నారు.
అయితే.. ఇప్పటికే.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి వారికి ఘన స్వాగతం పలికారు. సభకు దాదాపు 6 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. సభకు 3.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వందలాది బస్సులు, వేలాది కార్లలో జనం తరలివచ్చారు. ఎటు చూసినా పసుపు కండువాలతో సభా ప్రాంగణం అంతా పుసుపు వనంగా మారిపోయింది.
Also Read:
డిప్యూటీ సీఎం ఫొటోపై పిటిషన్.. కొట్టివేసిన హైకోర్ట్
జార్ఖండ్‌లో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్