Jharkhand ISIS Terrorist Arrested: జార్ఖండ్‌లో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్
ABN , Publish Date - Sep 10 , 2025 | 10:45 AM
జార్ఖండ్ రాంచీలోని ఇస్లాంనగర్ ప్రాంతంలో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది అజార్ డానిష్ అరెస్టు అయ్యాడు. ఢిల్లీలో అతడిపై కేసు నమోదు కావడంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి..
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్‌లో ఉంది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ (Jharkhand) రాంచీ నగరంలోని ఇస్లాంనగర్ ప్రాంతంలో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది (ISIS Terrorist) అజార్ డానిష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, జార్ఖండ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) రాంచీ పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా అజార్ డానిష్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి కొన్ని డిజిటల్ పరికరాలు, పాస్‌పోర్టులు, ఐడియాలజీకి సంబంధించిన డేటా వంటి ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అజార్ డానిష్‌పై ఢిల్లీలో గతంలో ఒక కేసు నమోదు కావడంతో, అతడిని అరెస్టు చేయడానికి ఢిల్లీ స్పెషల్ సెల్ ప్రత్యేకంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. అజార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఐసిస్ నెట్‌వర్క్ దేశంలో ఇంకా ఏ స్థాయిలో విస్తరించిందన్న దానిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
కోట్లు వసూలు చేసిన డాక్టర్ నమ్రత బ్యాచ్.. వేరువేరు రికార్డులు మెయింటైన్ చేస్తూ..
నేపాల్లో పరిస్థితి ఉద్రిక్తం..భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల
For More Latest News