Share News

Srushti Fertility Centre Scam: కోట్లు వసూలు చేసిన డాక్టర్ నమ్రత బ్యాచ్.. వేరువేరు రికార్డులు మెయింటైన్ చేస్తూ..

ABN , Publish Date - Sep 10 , 2025 | 10:22 AM

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో సిసిఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. డాక్టర్ నమ్రతను ఒకరోజు కస్టడీకి తీసుకొని విచారించిన సిసిఎస్ పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.

Srushti Fertility Centre Scam: కోట్లు వసూలు చేసిన డాక్టర్ నమ్రత బ్యాచ్.. వేరువేరు రికార్డులు మెయింటైన్ చేస్తూ..
Srushti Fertility Centre Scam

హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ (Srushti Fertility Centre) కేసులో సెంట్రల్ క్రిమినల్ సర్వీస్ (సిసిఎస్) పోలీసులు కొనసాగిస్తున్న విచారణలో కీలకమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో నమ్రతను ఒకరోజు కస్టడీకి తీసుకొని విచారించినట్లు అధికారులు తెలిపారు. ఏజెంట్ల నియామకం, శిశువుల కొనుగోలు, ఈ కార్యకలాపాలకు సహకరించిన అనేక డాక్టర్ల వివరాలను సేకరిస్తున్నారు.


పదేళ్ల పాటు సరోగసి ముసుగులో డాక్టర్ నమ్రత బ్యాచ్ కోట్లు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు సరోగసి కోసం వచ్చే దంపతుల వివరాలను వేరువేరు రికార్డులుగా నమ్రత మెయింటైన్ చేసినట్లు దర్యాప్తు బృందం తెలిపింది.అంతేకాకుండా, నగదు లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను నమ్రత తనకు పనిచేసే సిబ్బంది పేరుతో ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.


ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు అంచనా వేస్తున్నారు. ఈ వివరాల నేపథ్యంలో, నమ్రతను మరొకసారి కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సిసిఎస్ అధికారులు వెల్లడించారు. సృష్టి ఫెర్టిలిటీ కేసు సంచలనంగా మారడంతో ప్రభుత్వం, పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు.


Also Read:

భారత్, చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని ఈయూను కోరిన ట్రంప్

ఇకపై నో టెన్షన్..సెప్టెంబర్ 15 నుంచి యూపీఐ చెల్లింపుల్లో భారీ మార్పులు

For More Latest News

Updated Date - Sep 10 , 2025 | 10:29 AM