Share News

UPI Limit Increased: ఇకపై నో టెన్షన్..సెప్టెంబర్ 15 నుంచి యూపీఐ చెల్లింపుల్లో భారీ మార్పులు

ABN , Publish Date - Sep 10 , 2025 | 08:27 AM

డిజిటల్ భారత్ దిశగా మరో అడుగు వేస్తూ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు పెరిగిపోతున్న యూపీఐ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని, సెప్టెంబర్ 15, 2025 నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్‌ను పెంచనున్నట్టు ప్రకటించింది.

UPI Limit Increased: ఇకపై నో టెన్షన్..సెప్టెంబర్ 15 నుంచి యూపీఐ చెల్లింపుల్లో భారీ మార్పులు
UPI Limit Increased

మన దేశంలో డిజిటల్ పేమెంట్స్‌ని మరింత సులభతరం చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15, 2025 నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్‌ని (UPI transaction limit) పెంచుతోంది. దీంతో ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, క్యాపిటల్ మార్కెట్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, ట్రావెల్, ప్రభుత్వ సంబంధిత లావాదేవీలు వంటి పెద్ద మొత్తాల పేమెంట్స్ కూడా యూపీఐ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కొత్త మార్పులతో యూపీఐ మరింత శక్తివంతమైన పేమెంట్ ఆప్షన్‌గా మారబోతోంది.


ఏం మారింది?

ఎన్‌పీసీఐ ఈ కొత్త లిమిట్స్‌ని ప్రవేశపెట్టింది. ఇవి వివిధ కేటగిరీలకు వర్తిస్తాయి. ఒక్కో ట్రాన్సాక్షన్‌కి గరిష్టంగా రూ. 5 లక్షలు, రోజుకి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు కొన్ని కేటగిరీలలో చెల్లింపులు చేయవచ్చు. ఈ మార్పులు వ్యక్తులు, వ్యాపారులు ఇద్దరికీ పెద్ద పేమెంట్స్‌ని సులభంగా నిర్వహించేలా చేస్తాయి. ఎన్‌పీసీఐ చెప్పినట్టు యూపీఐ (UPI) ఇప్పుడు అందరి ఫేవరెట్ పేమెంట్ మోడ్‌గా మారింది.


కొత్త లిమిట్స్ ఏంటంటే...

  • క్యాపిటల్ మార్కెట్స్ & ఇన్వెస్ట్‌మెంట్స్: ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజుకి రూ. 10 లక్షలు.

  • ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్: ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజుకి రూ. 10 లక్షలు.

  • ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM): ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజుకి రూ. 10 లక్షలు.

  • ట్రావెల్ పేమెంట్స్: ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజుకి రూ. 10 లక్షలు.

  • క్రెడిట్ కార్డ్ పేమెంట్స్: ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజుకి రూ. 6 లక్షలు.


  • బిజినెస్/మర్చంట్ పేమెంట్స్: ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజువారీ లిమిట్ లేదు.

  • జ్యువెలరీ కొనుగోళ్లు: ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజుకి రూ. 6 లక్షలు.

  • ఫారిన్ ఎక్స్చేంజ్ రిటైల్ (BBPS ద్వారా): ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజుకి రూ. 5 లక్షలు.

  • డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్ & ఇనిషియల్ ఫండింగ్: ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, ఇనిషియల్ ఫండింగ్‌కి రోజుకి రూ. 2 లక్షలు.

  • పీర్-టు-పీర్ (P2P) ట్రాన్సాక్షన్స్‌కి పాత లిమిట్స్‌నే కొనసాగిస్తారు. అంటే, సాధారణ యూపీఐ పేమెంట్స్ ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 1 లక్షకి మించకూడదు.


ఈ మార్పులు ఎందుకు?

మన దేశంలో యూపీఐ (UPI) రోజురోజుకీ ఎక్కువ మంది ఇష్టపడే పేమెంట్ మోడ్‌గా మారుతోంది. చిన్న చిన్న లావాదేవీల నుంచి పెద్ద మొత్తాల వరకు అన్నీ యూపీఐ ద్వారా చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ కొత్త లిమిట్స్‌ ద్వారా పెద్ద పేమెంట్స్‌ని కూడా ఒకేసారి సులభంగా చేయొచ్చు. దీంతో అనేక ట్రాన్సాక్షన్స్ లేదా ఇతర బ్యాంకింగ్ ఛానెళ్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 08:28 AM