Home » UPI payments
భారతదేశం డిజిటల్ చెల్లింపుల రంగంలో అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ క్రమంలో యూపీఐ ఊహించని విధంగా పేమెంట్స్ విధానానాలను మార్చేసిందని పేపాల్ సీఈఓ అలెక్స్ క్రిస్ పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న క్రమంలో పేర్కొన్నారు.
యూపీఐ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 8, 2025 నుంచి యూపీఐ చెల్లింపులు మరింత సులభంగా మారనున్నాయి. ఇకపై పిన్ నంబర్ నొక్కకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ వినియోగించేవారికి గుడ్ న్యూస్. ఎందుకంటే నేటి (సెప్టెంబర్ 15, 2025) నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లిమిట్స్‌లో కీలక మార్పులను తీసుకొచ్చింది.
డిజిటల్ భారత్ దిశగా మరో అడుగు వేస్తూ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు పెరిగిపోతున్న యూపీఐ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని, సెప్టెంబర్ 15, 2025 నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్‌ను పెంచనున్నట్టు ప్రకటించింది.
స్మా్ర్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు చిన్న మొత్తాలను చెల్లించాలన్నా యూపీఐ యాప్స్ పైనే ఆధారపడుతున్నారు. నానాటికీ యూపీఐ మార్కెట్ పెరుగుతుండంటో భారత ప్రభుత్వం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఫోన్ పే, గూగల్ పే వంటి యాప్స్ పెద్ద సవాల్ ఎదురుకాబోతోందనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.
వ్యక్తుల మధ్య నేరుగా నగదు బదిలీకి ఉద్దేశించిన మనీ రిక్వెస్ట్ యూపీఐ ఫీచర్ త్వరలో కనుమరుగు కానుంది. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ ద్వారా లావాదేవీలకు అనుమతించొద్దంటూ ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది.
డిజిటల్ చెల్లింపుల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐలో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టనుంది. అక్టోబర్ 1,2025 నుంచి యూపీఐ (UPI) ఫీచర్ పీర్-టు-పీర్ (P2P) అంటే 'కలెక్ట్ రిక్వెస్ట్'ను పూర్తిగా నిలిపివేయనుంది.
నిన్న రాత్రి నుంచి ఇప్పటికీ ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల చాలా మంది యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య మీకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా లక్షల మంది యాప్ వినియోగదారులు చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.
22845 Crore Cyber Fraud: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు మరింత తెలివి మీరి పోతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా దేశంలో సైబర్ నేరాలు పెరగడానికి ఒకే ఒక్క కారణం.. జనం పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపటమే.
పాస్‌వర్డ్.. OTP.. PIN.. ఇలాంటివేవి అవసరం లేకుండా కేవలం కళ్లతో పేమెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పటివరకూ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే చూసిన ఈ అద్భుతం ఇకపై ఆచరణలోకి రాబోతోంది. కేవలం బయోమెట్రిక్స్, ఫేస్ ఐడీ, ఐరిస్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టేందుకు NPCI సన్నాహాలు చేస్తోంది.