BSNL PAY: యూపీఐ మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పేలకు షాక్ తప్పదా!
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:39 PM
స్మా్ర్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు చిన్న మొత్తాలను చెల్లించాలన్నా యూపీఐ యాప్స్ పైనే ఆధారపడుతున్నారు. నానాటికీ యూపీఐ మార్కెట్ పెరుగుతుండంటో భారత ప్రభుత్వం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఫోన్ పే, గూగల్ పే వంటి యాప్స్ పెద్ద సవాల్ ఎదురుకాబోతోందనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ యాప్‌లకు పెద్ద సవాలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్‌ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) తన కొత్త యూపీఐ యాప్ సేవలను ప్రారంభించబోతోంది. దీనికి బిఎస్‌ఎన్‌ఎల్ పే అని నామకరణం చేసినట్లు సమాచారం. ఈ సేవలు భీమ్ యాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ యాప్ లో యూజర్లు అన్ని రకాల ఆన్‌లైన్ చెల్లింపులు చేయగలరు. ఇటీవల దీని గురించిన ఆన్‌లైన్ బ్యానర్ వెలువడింది. దీంతో BSNL యూపీఐ సేవలు తీసుకువస్తుందని స్పష్టంగా అర్థమైంది.
BSNL పే ఎప్పుడు?
ప్రస్తుతం, కంపెనీ అధికారికంగా BSNL పే లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే, నివేదికల ప్రకారం, ఇది 2025 దీపావళి నాటికి ప్రారంభమవుతందని అంచనా వేస్తున్నారు. మరో ముఖ్య విషయం ఏటంటే దీని కోసం ప్రత్యేక యాప్ ఉండదు. బదులుగా, ఈ సౌకర్యం BSNL సెల్ఫ్ కేర్ యాప్‌లోనే లభిస్తుంది. ప్రస్తుతం BSNL సెల్ఫ్ కేర్ ఉపయోగిస్తున్న కస్టమర్‌లు కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసిన అవసరం లేదు.
BSNL Pay ద్వారా లభించే ప్రయోజనాలు
ఆల్-ఇన్-వన్ సేవలు: డిజిటల్ చెల్లింపులు, బిల్లు పేమెంట్లు, రీచార్జ్‌లు ఇలా అనేక సౌకర్యాలు.
అతితక్కువ స్థాయిలో ఫీజులు: ఇతర యాప్‌ల కంటే తక్కువ ఛార్జెస్ ఉండే అవకాశం ఉంది.
సెక్యూరిటీ హైలైట్: BHIM UPI ప్రోటోకాల్ ఆధారంగా ఉండటం వల్ల అధిక భద్రత కలుగుతుంది.
BSNL Self-Care లోనే అందుబాటు: వేరే యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
ఫోన్ పే, గూగుల్ పేలకు గట్టి పోటీ
ప్రస్తుతం మార్కెట్‌లో PhonePe, Google Pay, Paytm లాంటి యాప్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా BSNL Pay వచ్చే అవకాశం ఉండటంతో ఈ రంగంలో పోటీ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
బీఎస్ఎన్ఎల్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనప్పటికీ, ఈ దీపావళి (2025) నాటికి BSNL Pay సేవ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మొదటి విడతలో BSNL యూజర్లకే ఈ సౌకర్యం కల్పించే అవకాశముంది. అంతేగాక, ఇటీవలే బీఎస్ఎన్ఎల్ కొన్ని నగరాల్లో 5G సిమ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే 5G సేవలు ఇంకా ప్రారంభించలేదు. తాజా సమాచారం ప్రకారం, దీపావళి నుంచే బీఎస్ఎన్ఎల్ 5G సేవలు ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. ఇది బీఎస్ఎన్ఎల్ యూజర్లకు మరో గుడ్ న్యూస్ కావచ్చు.
ఇవి కూడా చదవండి
జీఎస్టీ శ్లాబ్స్‌లో మార్పు.. ఫార్మా ఎగుమతి సంస్థలకు కొత్త అవకాశాలు
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి