Chennai Cardiac Surgeon: తీవ్ర విషాదం.. గుండె పోటుతో ఆస్పత్రిలోనే ప్రాణం విడిచిన గుండె డాక్టర్..
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:51 PM
గ్రాడ్లిన్ రాయ్ చెన్నైలోని సవీత మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో కార్డియాక్ సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రతీ రోజూలాగే బుధవారం కూడా డ్యూటీకి వెళ్లాడు. ఆస్పత్రిలో రౌండ్లు వేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోయాడు.
ఈ మధ్యకాలంలో గుండె పోటు మరణాలు జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత రెండు, మూడేళ్లనుంచి గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్ల బారినపడి మరణిస్తున్నారు. ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే గుండె డాక్టర్లు(కార్డియాక్ స్పెషలిస్టులు) కూడా గుండెపోట్ల కారణంగా మరణిస్తున్నారు. తాజాగా, ఓ కార్డియాక్ సర్జన్ డ్యూటీలో ఉండగానే గుండె పోటుతో చనిపోయాడు.
ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రాడ్లిన్ రాయ్ చెన్నైలోని సవీత మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో కార్డియాక్ సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రతీ రోజూలాగే బుధవారం కూడా డ్యూటీకి వెళ్లాడు. ఆస్పత్రిలో రౌండ్లు వేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోయాడు. తోటి డాక్టర్లు వెంటనే రాయ్‌కి సీపీఆర్ చేశారు. ఐసీయూకు తీసుకెళ్లి చికిత్స మొదలెట్టారు. వాళ్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. రాయ్ చనిపోయాడు.
హైదరాబాద్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఈ సంఘటనపై మాట్లాడుతూ.. ‘రాయ్ కొలీగ్స్ అతడ్ని కాపాడ్డానికి ఎంతో ప్రయత్నించారు. సీపీఆర్, అర్జంట్ యాంజీప్లాస్టీ విత్ స్టంటింగ్, ఇంట్రా ఆరోటిక్ బలూన్, ఈసీఎమ్ఓ కూడా చేశారు. అయినా ఎలాంటి లాభం లేకపోయింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఎడమ వైపు ఉండే ప్రధానమైన ఆర్టరీ 100 శాతం బ్లాక్ అయిపోయింది. రాయ్ చనిపోయాడు. ఈ మధ్య కాలంలో 30 నుంచి 40 ఏళ్ల వయసున్న డాక్టర్లు గుండెపోట్ల కారణంగా చనిపోవటం బాగా పెరిగిపోయింది.
పని ఒత్తిడి కూడా ఈ మరణాలకు కారణం. 12 నుంచి18 గంటలు పని చేస్తున్నారు. కొన్నిసార్లు 24 గంటలు కూడా పనిచేస్తున్నారు. వారిపై తీవ్రమైన ఒత్తిడిపడుతోంది. సరైన జీవన విధానం లేకపోవటం, తిండి సరిగా తినకపోవటం, వ్యాయామం చేయకపోవటం, హెల్త్ చెకప్స్ చేయించుకోకపోవటం వంటివి మరణాలకు దారి తీస్తున్నాయి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
సగానికి తగ్గిన టమోటా ధర.. కిలో ఎంతంటే..
షూ నుంచి విచిత్ర శబ్ధం.. కదిలించగా షాక్..