Share News

Sangareddy: షూ నుంచి విచిత్ర శబ్ధం.. కదిలించగా షాక్..

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:45 PM

ఓ విద్యార్థిని షూలో పాము ప్రత్యక్షమైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లాకు చెందిన ఓ యువతి సంగారెడ్డిలోని బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో చదువుతోంది.

Sangareddy: షూ నుంచి విచిత్ర శబ్ధం.. కదిలించగా షాక్..

సంగారెడ్డి: వర్షాకాలం వచ్చింది అంటే.. పాములు, కీటకాల బెడద ఎక్కువ ఉంటుంది. అందుకోసమే.. తగు జాగ్రత్తలు తీసుకుంటూ.. ఇంటి పరిసరాలు, తిరిగే చోట్లు అన్ని శుభ్రం చేసుకుంటాం. ఎంత శుభ్రం చేసుకున్న ఇంటి పరిసరాల్లో అడపదడప పాములు, కీటకాలు కనపడుతూనే ఉంటాయి. అదే గ్రామాల్లో అయితే చెప్పాల్సిన పనేలేదు. గ్రామాల్లో మాదిరిగానే.. జిల్లాలోని ఓ బీఎస్సీ నర్సింగ్ హాస్టల్‌లో పాములు ప్రత్యేక్షం అవుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.


ఓ విద్యార్థిని షూలో పాము ప్రత్యక్షమైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లాకు చెందిన ఓ యువతి సంగారెడ్డిలోని బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో చదువుతోంది. ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లేందుకు హాస్టల్ వద్ద ఆ విద్యార్థిని షూ వేసుకుంటుండగా.. అందులో పాము కనిపించింది. దాంతో ఆమె ఒక్కసారిగా భయాందోళనకు గురై షూను.. దూరంగా విసిరేసింది. కొద్దిసేపటికి పాము షూ నుంచి బయటకు రాగా.. స్థానికులు కర్రతో కొట్టి చంపారు. పాము షూలోకి రావడంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. నర్సింగ్ కళాశాల హాస్టల్‌కు సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. అయితే హాస్టల్లోకి తరచుగా పాములు వస్తున్నాయని విద్యార్థినిలు చెబుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


వి కూడా చదవండి:

ఉసిరితోనూ సైడ్ ఎఫెక్ట్స్.. వీటిని ఎవరు తినకూడదంటే..

బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..

Updated Date - Aug 30 , 2025 | 01:08 PM