Share News

Pharma Exporters GST: జీఎస్టీ శ్లాబ్స్‌లో మార్పు.. ఫార్మా ఎగుమతి సంస్థలకు కొత్త అవకాశాలు

ABN , Publish Date - Aug 30 , 2025 | 02:54 PM

భారత్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఔషధాలు ఎగుమతి చేస్తూ ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్‌గా ప్రసిద్ధి గాంచింది. అయితే దేశంలో కొత్తగా ప్రతిపాదించిన GST శ్లాబ్స్ విధానం ఔషధాల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో మార్పులు చేయాలని అంటున్నాయి.

Pharma Exporters GST: జీఎస్టీ శ్లాబ్స్‌లో మార్పు.. ఫార్మా ఎగుమతి సంస్థలకు కొత్త అవకాశాలు
Pharma Exporters GST

భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఔషధాలు ఎగుమతి అవుతుంటాయి. అందుకే ఇండియాను ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది. ఇదే సమయంలో భారత ప్రభుత్వం ఒక కొత్త GST (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధపడుతోంది. ఈ మార్పులు చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని భారత ఫార్మాస్యూటికల్ ఎగుమతి ప్రోత్సాహక మండలి హెచ్చరిస్తోంది. దీని వల్ల అనేక సవాళ్లు ఎదురవుతాయని అంటోంది.


కొత్త విధానంలో ఎంటి సవాళ్లు?

ప్రస్తుతం భారతదేశంలో ఫార్మాస్యూటికల్స్‌కు రెండు విభిన్న రేట్లలో పన్నులు ఉన్నాయి. పూర్తైన ఔషధాలపై 12% ట్యాక్స్, వాటి ఉత్పత్తిలో భాగంగా ఉండే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ (APIs) పై 18% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆ మధ్య 6% వ్యత్యాసం ఉంది. ఇప్పుడు, ప్రభుత్వం GST రేట్లను 5%, 18% అని రెండు శ్లాబులుగా తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మార్పు అమలైతే, గ్యాప్ మరింత పెరిగి 13%కి చేరుకుంటుంది. దీంతో చిన్న వ్యాపారాలు, ప్రత్యేకంగా MSMEలు నష్టాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని అంటున్నారు.


అలాగే సమస్య ఏంటి?

ఈ క్రమంలో జీఎస్టీ మార్పులు అనేక వర్గాల్ని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. ప్రత్యేకంగా, ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు సంబంధించిన చిన్న వ్యాపారాలు, MSMEs ప్రత్యేకంగా ప్రెస్క్రిప్షన్ ఔషధాలను తయారు చేసే కంపెనీలు నష్టపోతాయని ఆయా వర్గాలు అంటున్నాయి.

జీఎస్టీ రీఫండ్ వసూళ్లను సాధించాలంటే, పన్ను కట్టిన తర్వాత కొన్ని రోజుల్లో మరొకటి దరఖాస్తు చేయాలి. కానీ, ఎన్నో సందర్భాలలో ఈ పద్ధతులు ఆలస్యం అవుతుంటాయని, తద్వారా పనివేళల్లో డబ్బు తగ్గడం, పన్ను వసూలు చేయడంలో ఆలస్యం అవుతుందన్నారు. దీని ద్వారా వ్యాపారాలకు నగదు ప్రవాహం క్రమంగా తగ్గుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి.


ఏం చేయాలి?

ఈ సమస్యలు పరిష్కరించడానికి ఫార్మెక్సిల్ కొన్ని సూచనలు ఇచ్చింది. ఈ సూచనల్లో ప్రధానమైనది APIలు, ఫార్ములేషన్ (పూర్తయిన ఔషధాలు)పై GST రేట్లు సమానంగా ఉంచాలని కోరారు. ఒకే రేటులో APIs, ఫార్ములేషన్ లు ఉంటే ఇన్వర్టెడ్ డ్యూటీ కేటగిరి సమస్యను తగ్గిపోతుందన్నారు. దీని ద్వారా రేట్ల మధ్య తేడా లేకుండా పరిశ్రమకి స్థిరత్వం లభిస్తుందన్నారు. అలాగే, రీఫండ్ ఫెసిలిటేషన్‌ను మరింత వేగవంతం చేయాలని ఫార్మెక్సిల్ సూచించింది. 15-30 రోజులలోపు రీఫండ్ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2025 | 03:00 PM