Share News

Rajnath Singh: శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 30 , 2025 | 02:52 PM

ఇండియా ఎవరినీ శత్రువుగా భావించదని, ఇదే సమయంలో ప్రజల ప్రయోజనాలకు భంగం కలగనీయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Rajnath Singh: శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
Rajnath Singh

న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి అత్యావశ్యకమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. దేశాల మధ్య శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం అనేది ఉండదని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని నొక్కిచెప్పారు. అమెరికాతో టారిఫ్ ఉద్రిక్తతలు, ప్రధాన మంత్రి మోదీ చైనా పర్యటనలో నేపథ్యంలో ఇండియా-చైనా సంబంధాలపై భారత్ అనుసరిస్తున్న వైఖరిని ఆదివారంనాడిక్కడ జరిగిన ఓ జాతీయ మీడియా సదస్సులో రాజ్‌నాథ్ వివరించారు.


ముఖ్యాంశాలు

1. మన వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా ఆత్మనిర్భరత అనేది చాలా ముఖ్యం. మనకు శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం అనేది ఉండదు. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యపరంగా యుద్ధం తరహా పరిస్థితి ప్రస్తుతం ఉంది. అమెరికా అధ్యక్షుడు భారత్ వస్తువులపై 50 శాతం సుంకం విధించారు. జాతీయ ప్రయోజనాల విషయంలో ఇండియా రాజీ పడదు. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా భారతదేశం రైతులు, చిన్న వ్యాపారులు, దుకాణదారులు, పశువుల పెంపకందారులు, సాధారణ ప్రజానీకం ప్రయోజనాలకు నిరంతరం ప్రాధాన్యతనిస్తుంది. ఇండియా ఎవరినీ శత్రువుగా భావించదు. ఇదే సమయంలో ప్రజల ప్రయోజనాలకు భంగం కలగనీయం.


2. సెల్ఫ్ రిలయెన్స్ అనేది కేవలం అడ్వాంటేజ్ కాదు, అనివార్యం. ప్రపంచం వేగంగా మారుతోంది. కొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయి. రక్షణరంగంలో ఇతరులపై ఎంతోకాలం ఆధారపడలేం. ప్రస్తుత పరిస్థితుల్లో స్వయం సమృద్ధి ఇటు ఆర్థిక వ్యవస్థకు మన భద్రతకు చాలా ముఖ్యం.

3. భవిష్యత్ యుద్ధ నౌకలన్నీ దేశీయంగానే తయారవుతారు. త్వరలోనే సుదర్శన్ చక్ర డిఫెన్స్ సిస్టంను ఆవిష్కరించనున్నాం.

4.స్వదేశీ డిఫెన్స్ సిస్టమ్‌ల సమర్ధత ఏమిటో పహల్గాం ఉగ్రదాడి అనంతరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో చాటి చెప్పాం.

5.2014లో రూ.700 కోట్లు ఉన్న రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఇవాళ రూ.24,000 కోట్లకు పెరిగాయి. దిగుమతుదారు నుంచి ఎగువతిదారుగా భారత్ ఎదిగింది.


ఇవి కూడా చదవండి..

జమ్మూకశ్మీర్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్.. పలువురు మృతి

ఓట్ల చోరీపై అప్రమత్తంగా ఉండండి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2025 | 02:56 PM