CM Stalin: ఓట్ల చోరీపై అప్రమత్తంగా ఉండండి..
ABN , Publish Date - Aug 30 , 2025 | 09:29 AM
బిహార్ తరహాలో రాష్ట్రంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - సర్) పేరుతో ఓట్ల చోరీకి పాల్పడే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయంలో పార్టీ శ్రేణులు, ప్రత్యేకించి పోలింగ్ బూత్ ఇన్‌ఛార్జీలు అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు.
- పార్టీ శ్రేణులకు డీఎంకే అధినేత స్టాలిన్ పిలుపు
చెన్నై: బిహార్ తరహాలో రాష్ట్రంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - సర్) పేరుతో ఓట్ల చోరీకి పాల్పడే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయంలో పార్టీ శ్రేణులు, ప్రత్యేకించి పోలింగ్ బూత్ ఇన్‌ఛార్జీలు అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పిలుపునిచ్చారు. నగరంలో శుక్రవారం ఉదయం జరిగిన డీఎంకే న్యాయవిభాగం కార్యదర్శి, ఎంపీ ఎన్‌ఆర్ ఇళంగో కుమార్తె రాఘవి వివాహ వేడుకల్లో ఆయన సతీమణి దుర్గాస్టాలిన్‌తో పాటు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, డీఎంకే కోశాధికారి, ఎంపీ టీఆర్ బాలు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి, మంత్రి సామినాథన్, ఎంపీ తిరుచ్చి శివా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశం అతిక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నదన్నారు. నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం కేంద్రంలోని పాలకపక్షానికి సానుకూలంగా ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. బిహార్‌లో జరిగిన ఓట్ల చోరీ ఎంతటి తీవ్ర ప్రభావం కలిగిస్తోందో అందరికీ తెలిసిందేనన్నారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఓట్ల చోరీకి వ్యతిరేకంగా బిహార్‌లో నిర్వహించిన నిరసన ర్యాలీలో తాను కూడా పాల్గొన్నానని, ఆ ర్యాలీకి ప్రజానీకం నుంచి మంచి స్పందన కనిపించిందన్నారు. బిహర్ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడకుండా పార్టీ శ్రేణులు, మిత్రపక్షాలకు చెందిన కార్యకర్తలు సైతం అప్రమత్తంగా వ్యవహరించాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఎన్నికల సంఘం అధికారులు తప్పిదాలకు పాల్పడేందుకు వస్తే అడ్డుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం జరిపే ఓట్ల చోరీని నిరోధించే దిశగా ఎన్‌ఆర్ ఇళంగో చట్ట పోరాటం సాగించారని కూడా స్టాలిన్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి
Read Latest Telangana News and National News