Civil Surgeon Specialist : సివిల్ సర్జిన్ స్పెషలిస్టులకు ప్రమోషన్ ఇస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:38 PM
2024-25 ప్యానల్ ఇయర్‌కు సంబంధించి సివిల్ సర్జిన్ స్పెషలిస్టులకు ప్రమోషన్ ఇస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అటు, ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న లవ్ అగర్వాల్ ను మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్పేర్ అడిషనల్ సెక్రటరీగా..
అమరావతి, ఆగస్టు 30 : 2024 - 25 ప్యానల్ ఇయర్‌కు సంబంధించి సివిల్ సర్జిన్ స్పెషలిస్టులకు ప్రమోషన్ ఇస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో..
ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాపూర్ సీహెచ్ సీ లో పనిచేస్తున్న డాక్టర్ వి సరస్వతిని నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా ఏహెచ్ కు బదిలీ చేశారు.
డాక్టర్ ఎం ఉషాబాలను ఎంసిహెచ్ ఒంగోలు నుంచి, ఏహెచ్ కావలి నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు.
డాక్టర్ ఎన్ శైలజను ఏహెచ్ ధర్మవరం అనంతపురం నుంచి, ఏహెచ్ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లాకు బదిలీ చేశారు.
డాక్టర్ ఎన్ వనజ కుమారిని సిహెచ్‌సి ఏళేశ్వరం ఈస్ట్ గోదావరి నుంచి, ఏహెచ్ రంపచోడవరంకు బదిలీ చేశారు.
ఆర్డర్ అందుకున్న పదిహేను రోజుల్లోగా ఆయా స్ధానాల్లో జాయిన్ కావాలని ఆదేశిస్తు ఉత్తర్వులు జారీ చేశారు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంపి కృష్ణబాబు.
అటు, ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న లవ్ అగర్వాల్‌ను మినిస్టరీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్పేర్ అడిషనల్ సెక్రటరీగా నియమించడంతో ఆయన్ను రివీల్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సివిల్‌సప్లైస్ కమిషనర్ సౌరభ్ గౌర్‌కు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.