Share News

UPI Collect request: UPIలో కొత్త మార్పు.. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ కట్..!

ABN , Publish Date - Aug 14 , 2025 | 06:39 PM

డిజిటల్ చెల్లింపుల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐలో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టనుంది. అక్టోబర్ 1,2025 నుంచి యూపీఐ (UPI) ఫీచర్ పీర్-టు-పీర్ (P2P) అంటే 'కలెక్ట్ రిక్వెస్ట్'ను పూర్తిగా నిలిపివేయనుంది.

UPI Collect request: UPIలో కొత్త మార్పు.. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ కట్..!
NPCI Ends P2P Collect Requests

డిజిటల్ చెల్లింపులు చేసే యూజర్లకు కీలక హెచ్చరిక. యూపీఐ (UPI) ద్వారా నగదు సేకరించే అవకాశం కలిగించే ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ అక్టోబర్ 1,2025 తర్వాత ఇక కనిపించదు. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల ఓ సర్క్యులర్ జారీ చేసింది. బ్యాంకులు, పేమెంట్ యాప్స్ (ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర UPI యాప్స్), యూపీఐ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు.. తమ సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను అక్టోబర్ 1 లోపు అప్డేట్ చేయాలని ఎన్‌పీసీఐ ఆదేశించింది.


యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లోని పీర్-టు-పీర్ (P2P) 'కలెక్ట్ రిక్వెస్ట్' ఫీచర్‌ను అక్టోబర్ 1, 2025 నుండి నిలిపివేయనున్నట్లు NPCI ప్రకటించింది. యూపీఐ చెల్లింపుల్లో ఆర్థిక మోసాలను నిరోధించడమే లక్ష్యంగా NPCI ఈ మార్పుకు నాంది పలికింది. 'కలెక్ట్ రిక్వెస్ట్' లేదా 'పుల్ ట్రాన్సాక్షన్' ద్వారా ఏ వినియోగదారుడైనా మరొకరి నుంచి డబ్బు అడగవచ్చు. అయితే, ఈ ఫీచర్‌ద్వారా ఇటీవల కొందరు కేటుగాళ్లు మోసాలు చేస్తుండడం ఎన్‌పీసీఐ దృష్టికి వచ్చింది. డబ్బులు రావాలన్న నెపంతో Collect Request పంపించి.. PIN ఎంటర్ చేయగానే డబ్బులు నొక్కేస్తున్న ఘటనలు పెరిగాయి. దీనికి విరుగుడుగా 2019లో ఎన్‌పీసీఐ Pull-based ట్రాన్సాక్షన్లపై రూ.2000 గరిష్ఠ పరిమితి విధించింది. కానీ మోసాలు ఆగకపోవడంతో ఇప్పుడు ఈ ఫీచర్‌ను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.


ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి యూపీఐ (UPI) ఫీచర్ 'కలెక్ట్ రిక్వెస్ట్' మాయమవుతుంది. యూపీఐలో Collect Request సేవలు అందుబాటులో ఉండవు. ఎవరూ ఈ ఫీచర్‌ను ఉపయోగించలేరు. యాప్‌లు ఈ సదుపాయాన్ని పూర్తి స్థాయిలో తొలగించి Pull requests (మరొకరినుంచి డబ్బులు కోరే విధానం) పూర్తిగా నిలిపివేస్తాయి. కాబట్టి, ఇకపై'సర్, మీ ఖాతాలో రూ. 10000 క్యాష్‌బ్యాక్ వచ్చింది. దాన్ని పొందడానికి మీ UPI యాప్‌లో వచ్చిన అభ్యర్థనను ఆమోదించండి..' అంటూ మీకు కాల్ వస్తే జాగ్రత్తగా ఉండండి!.


ఇవి కూడా చదవండి

సచిన్ కాబోయే కోడలు సానియా చందోక్ సంపాదన, ఆస్తి ఎంతో

EPFO కొత్త రూల్ ఫేస్ ఆధారిత టెక్నాలజీతో UAN జనరేషన్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 06:47 PM