Pakistan Cricket Team: పాక్ జట్టు నిండా స్వార్థపరులే.. గెలవాలనే కోరిక లేదు.. షోయెబ్ అక్తర్ ఆగ్రహం
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:21 PM
పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై అభిమానులే కాదు.. ఆ జట్టు మాజీ ఆటగాళ్లు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వెస్టిండీస్ చేతిలో పాకిస్థాన్ దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. మూడో వన్డేలో 200 పైచిలుకు పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్ ఘోరంగా విఫలమయ్యారు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై (Pakistan Cricket Team) అభిమానులే కాదు.. ఆ జట్టు మాజీ ఆటగాళ్లు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వెస్టిండీస్ చేతిలో పాకిస్థాన్ దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది (Pak vs WI). మూడో వన్డేలో 200 పైచిలుకు పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఆ జట్టు ప్రదర్శనపై మాజీ బౌలింగ్ లెజెండ్ షోయెబ్ అక్తర్ (Shoaib Akhtar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ జట్టులో సమూల మార్పులు రావాలని ఆకాంక్షించాడు.
'మా సమయంలో కేవలం ఒక్కరి పైనే ఆధారపడి ఆడేవాళ్లం కాదు. జట్టంతా సమష్టిగా ఆడి ట్యాలెంట్ ప్రదర్శించాలని చూసేవాళ్లం. ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర సమర్థంగా పోషించడానికే చూసేవారు. కానీ, ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి మారిపోయింది. గత పదేళ్లుగా ప్రతి ఒక్క ఆటగాడూ తన స్వలాభం కోసమే ఆడుతున్నాడు. జట్టు ప్రయోజనాలను పక్కనపెట్టి తమ వ్యక్తిగత సగటును పెంచుకోవడానికే చూస్తున్నారు. జట్టు గెలవాలనే కోరిక ఎవరిలోనూ కనిపించలేద'ని అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'పాకిస్థాన్ క్రికెట్ మెరుగుపడాలంటే జట్టు పరిస్థితిలో మార్పు రావాలి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జట్టు గెలుపు కోసం ఆలోచించాలి. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు ఆ పరిస్థితులుకు అనుగుణంగా ఆటతీరును మార్చుకోవాలి. మీరేమీ రావల్పిండి పిచ్‌పై ఆడడం లేదు. మీరు వెళ్లిన ప్రతిచోటుకు రావల్పిండి పిచ్‌ను తీసుకెళ్లలేం కదా' అని అక్తర్ వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి..
సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరో తెలుసా?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..