UPI Down: యూపీఐ చెల్లింపుల్లో ఇబ్బందులు.. నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న అవాంతరాలు
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:13 PM
నిన్న రాత్రి నుంచి ఇప్పటికీ ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల చాలా మంది యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య మీకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా లక్షల మంది యాప్ వినియోగదారులు చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మీ ఫోన్ పే లేదా గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు కావడం లేదా?. ఈ సమస్య మీకు మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా అనేక మంది యూజర్లకు ఇదే సమస్య నిన్న రాత్రి నుంచి కొనసాగుతోంది (UPI down August 7). ఆగస్టు 8న కూడా ఇదే కస్టమర్లు ఫోన్ పే చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఫండ్ ట్రాన్స్ ఫర్ చేయడం లేదా బ్యాలెన్స్ చెక్ చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయి. నిన్న రాత్రి (ఆగస్టు 7) దాదాపు 8:30 తర్వాత నుంచి UPI సేవల్లో గందరగోళం మొదలైంది. Downdetector అనే అవుటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం చాలామంది యూజర్లు పేమెంట్స్, ఫండ్ ట్రాన్స్ ఫర్ల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
అనేక సమస్యలు
ఈ క్రమంలో 62 శాతం మంది యూజర్లు పేమెంట్ సమస్యలపై ఫిర్యాదు చేశారు. 29 శాతం మనీ ట్రాన్స్ ఫర్ టైంలో సమస్యలు వచ్చినట్లు వెల్లడించారు. మరో 8 శాతం మంది యాప్ గ్లిచెస్ ఉన్నాయని అన్నారు. ఈ సమస్యలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పందించింది. తమ అధికారిక X (Twitter) అకౌంట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.
కొన్ని బ్యాంకుల్లో టెక్నికల్ సమస్య వల్ల UPI కనెక్టివిటీ సమస్యలు వచ్చాయని వెల్లడించింది. మా సిస్టమ్స్ సరిగ్గానే పని చేస్తున్నాయని, బాధ్యత ఉన్న బ్యాంకులతో కలిసి తాము సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపింది. అంటే అసలు సమస్య NPCI వద్ద కాదని, కొన్ని బ్యాంకుల టెక్నికల్ లోపాల వల్ల జరిగిన అవాంతరమని స్పష్టమైంది.
సోషల్ మీడియా వేదికగా స్పందనలు
ఈ సమయంలో చాలా మంది యూజర్లు తమ ఫ్రస్ట్రేషన్‌ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సీరియస్‌గా రియాక్ట్ కాగా, ఇంకొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యూజర్ మళ్లీ UPI సర్వర్ డౌన్ అయిందని ఎక్స్ లో ఓ పోస్టు చేశాడు. ఇంకొంత మంది మాత్రం అసలు విషయం అర్థం చేసుకుని తమ బ్యాంకుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. మీ బ్యాంక్ UPI పని చేయడం లేదేంటి? సరిగా నిర్వహించలేకపోతే మూసేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెండింగ్ లావాదేవీ..
UPIలో మరో పెద్ద మార్పు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది. మీరు రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చేసేందుకు ట్రై చేస్తే యాప్ అనుమతించదు. బిల్లులు చెల్లించేందుకు ఉదయం 10 గంటల ముందు, రాత్రి 9:30 తర్వాతే ప్రాసెసింగ్ ఉంటుంది. ఒక పెండింగ్ లావాదేవీ స్టేటస్‌ను గరిష్ఠంగా 3 సార్లు మాత్రమే చెక్ చేసేందుకు ఛాన్సుంది. అంతేకాకుండా ఒక్కోసారి మధ్య 90 సెకన్ల గ్యాప్ ఉండాలి.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? లేక మారటోరియం తీసుకోవాలా?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి