UPI Biometric Payments: రేపటి నుంచి యూపీఐలో కొత్త ఫీచర్..పిన్ నొక్కకుండానే చెల్లింపులు..
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:47 PM
యూపీఐ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 8, 2025 నుంచి యూపీఐ చెల్లింపులు మరింత సులభంగా మారనున్నాయి. ఇకపై పిన్ నంబర్ నొక్కకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో అద్భుతమైన మార్పు రాబోతోంది. రేపటి నుంచి (అక్టోబర్ 8, 2025) యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) వినియోగదారులు పిన్ లేదా పాస్‌వర్డ్ నొక్కకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. ఎలాగంటే? మీ ముఖం లేదా వేలిముద్ర ద్వారా చేసుకునే ఛాన్సుంది. బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపు విధానంతో యూపీఐ చెల్లింపులు (UPI Biometric Payments) ఇకపై మరింత సులభం కానున్నాయి.
బయోమెట్రిక్ చెల్లింపులు అంటే ఏంటి
ఇప్పటివరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి మనం నాలుగు లేదా ఆరు అంకెల పిన్‌ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. కానీ ఇకపై ఆ పిన్ అవసరం లేదు. భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్ ఆధారంగా నమోదైన మీ బయోమెట్రిక్ డేటా (ముఖ గుర్తింపు లేదా వేలిముద్ర) ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ సాంకేతికత మీ గుర్తింపును త్వరగా ధృవీకరించి, సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేస్తుంది.
ఈ మార్పు ఎందుకు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల డిజిటల్ చెల్లింపుల కోసం పిన్‌తో పాటు ఇతర గుర్తింపు పద్ధతులను అనుమతించింది. దీనిలో భాగంగా బయోమెట్రిక్ ఆధారిత ధృవీకరణ విధానం అమల్లోకి వస్తోంది. ఈ కొత్త ఫీచర్ యూపీఐ చెల్లింపులను మరింత వేగవంతం చేయడమే కాకుండా, వినియోగదారులకు సౌలభ్యాన్ని అందిస్తుంది. పిన్‌ను గుర్తుంచుకోవడం లేదా టైప్ చేయడం వంటి ఇబ్బందులు ఇక ఉండవు.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
మీరు యూపీఐ యాప్ ద్వారా చెల్లింపు చేయాలనుకున్నప్పుడు, పిన్ ఎంటర్ చేయడానికి బదులు మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా ముఖ గుర్తింపు లేదా వేలిముద్ర స్కానర్ ద్వారా ధృవీకరణ చేయాలి. ఈ డేటా ఆధార్ డేటాబేస్‌తో సరిపోల్చబడి, క్షణాల్లోనే మీ లావాదేవీ పూర్తవుతుంది.
ఈ ప్రక్రియ వేగవంతం కావడమే కాదు, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ డేటా కారణంగా సురక్షితంగా ఉంటుంది. ఈ బయోమెట్రిక్ ఫీచర్ ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా టెక్నాలజీ పెద్దగా పరిచయం లేని వారు, పిన్‌ను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడేవారికి ఇది సౌలభ్యంగా ఉంటుంది.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి