Pawan Kalyan Photo Controversy: డిప్యూటీ సీఎం ఫొటోపై పిటిషన్.. కొట్టివేసిన హైకోర్ట్
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:12 AM
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై విచారించిన హైకోర్టు..
అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Deputy CM Pawan Kalyan) ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు చేయకూడదని నిషేధం ఎక్కడ ఉంది? అని ప్రశ్నించింది.
రాజకీయ దృష్టితో, ఉద్దేశపూర్వకంగా పిటిషన్ దాఖలైందని అభిప్రాయపడింది. అయితే, ప్రజాహిత ప్రయోజనాల కోసం చట్టబద్ధంగా కోర్టును ఆశ్రయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. సమాజానికి మేలు చేసే విధంగా, నిజమైన ప్రజా ప్రయోజనాలపై దృష్టి సారించిన పిటిషన్లను మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో పాటు, రాజకీయ లక్ష్యాలతో కోర్టులను వేదికగా మార్చే ప్రయత్నాలు మంచిదికాదని ధర్మాసనం హెచ్చరించింది.
కాగా, డిప్యూటీ సీఎం ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ప్రదర్శిస్తున్నారంటూ రైల్వే విశ్రాంత ఉద్యోగి వై.కొండలరావు ఈ పిల్ దాఖలు చేశారు. చిత్రపటాల ప్రదర్శన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం తీసుకొచ్చేవరకు కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటో తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపి పిటిషన్‌ను కొట్టివేసింది.
Also Read:
జార్ఖండ్‌లో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్
నేపాల్లో పరిస్థితి ఉద్రిక్తం..భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల
For More Latest News