PVN Madhav: తెలుగు భాషకు జీవం పోసిన నవయుగ వైతాళికుడు జాషువా..
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:53 PM
తెలుగు భాషలో జాతీయ కవులు లేరా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు జాతీయ స్థాయి కవిగా జాషువా గుర్తుకు వస్తారని మాధవ్ తెలిపారు. ఆయన గబ్బిలం పేరుతో రచనలు చేస్తే.. దాని గురించి దేశ నలుమూలలను ప్రస్తావించారని గుర్తు చేశారు.
విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బీజేపీ ఏపీ అధ్యక్షులు పి.వి.ఎన్.మాధవ్, గేయ రచయిత అనంత శ్రీరామ్ హజరయ్యారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పి.వి.ఎన్.మాధవ్ మీడియాతో మాట్లాడారు. సమరసతా స్వరం.. జాతీయతా గళం..పేరుతో జాషువా జయంతి నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
తెలుగు భాషలో జాతీయ కవులు లేరా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు జాతీయ స్థాయి కవిగా జాషువా గుర్తుకు వస్తారని మాధవ్ తెలిపారు. గబ్బిలం పేరుతో ఆయన రచనలు చేస్తే.. దాని గురించి దేశ నలుమూలలను ప్రస్తావించారని గుర్తు చేశారు. అంతకుమించి దేశభక్తితో ఆయన రచనలు ఉన్నాయని పేర్కొన్నారు. సమాజంలో రుగ్మతలపై కేవలం 20 శాతం రచనలు ఉంటే.. 70 శాతం దేశభక్తి రచనలు ఉన్నాయని వివరించారు. తెలుగు భాషను రక్షించిన మహోన్నత వ్యక్తి ఆలోచనలు జాతీయ స్ధాయికి తీసుకుని వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ నడుం బిగించిందని స్పష్టం చేశారు. భారత ప్రధాన మంత్రి మోదీ దేశం కోసం త్యాగాలు చేసిన ఎందరినో వెలుగులోకి తీసుకుని వచ్చారని చెప్పుకొచ్చారు. ఆవిధంగా తెలుగు భాషకు జీవం పోసిన వైతాళికులను వెలుగులోకి తీసుకుని రావడమే తన ధ్యేయమని మాధవ్ స్పష్టం చేశారు.
అనంతరం గేయ రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. జాడ్యాన్ని ప్రశ్నించిన గొప్ప వ్యక్తి గుర్రం జాషువా అని కొనియాడారు. జాషువా గొప్ప వ్యక్తిత్వం కలవారు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని వివరించారు. ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వ్యంగ్యంగా తిప్పి కొట్టారు తప్ప ఆయన ఎవరినీ కించపరచలేదని తెలిపారు. మంచిని స్వీకరించడం చెడును విసర్జించడం జాషువాలో ఉన్న వ్యక్తిత్వమని పేర్కొన్నారు. క్రీస్తు రచన చేసిన జాషువా కృష్ణుడుని నమ్మారన్నారు. తనను తాను భరతమాత పుత్రుడుగా అభివర్ణించుకున్న గొప్ప వ్యక్తి జాషువా అని శ్రీరామ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కరూర్ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..
విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలు ఇవేనా..?