Pawan Kalyan Promise: మాటిస్తున్నా.. ఉప్పాడలో సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తా: పవన్
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:55 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) కాకినాడలోని కలెక్టరేట్ లో ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన పవన్ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉప్పాడ(Uppada) మత్స్యకారుల సమస్యలపై చర్చించామని పవన్ కల్యాణ్ తెలిపారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) కాకినాడలోని కలెక్టరేట్ లో ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన పవన్ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉప్పాడ(Uppada) మత్స్యకారుల సమస్యలపై చర్చించామని పవన్ కల్యాణ్ తెలిపారు. చేపల వేటపై 7 వేలకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏటా రూ.20 వేలు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతోందనే ఆందోళన ఉందన్నారు. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంపై ఈనెల 14న సమావేశం నిర్వహిస్తామని, అలానే ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామని మత్స్యకారులకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
ఇక పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..' రూ.323 కోట్లతో సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్రం సానుకూలం ఉంది. ఉప్పాడ-కొణపాక మధ్య తీరరక్షణ పనులు ప్రారంభించాం. పరిశ్రమల వ్యర్థాల శుద్ధిపై మూడు విడతల్లో పరిశీలిస్తాం. మత్స్యకారులు ఎక్కడికి చెబితే అక్కడికి మూడ్రోజుల్లో వస్తాను. వ్యర్థాలు ఎక్కడ కలుస్తున్నాయో.. అక్కడికే బోటులో వెళ్తాను. ప్రజలను వంచించాలని నాకు ఎప్పుడూ ఉండదు. ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతాను. 100 రోజుల సమయం ఇస్తే.. కాలుష్యం తగ్గింపుపై ప్రణాళిక రూపొందిస్తాను' అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు.
కొద్దిరోజుల క్రితం ఉప్పాడలో మత్స్యకారులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పరిశ్రమల వ్యర్థాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని.. ప్రభుత్వం ఆదుకోవాలని ధర్నా చేపట్టారు. ఈ నిరసనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఓ కమిటీని నియమించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తాను కూడా కాకినాడ(Kakinada) వచ్చి మత్స్యకారులతో సమావేశమవుతానని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు గురువారం పవన్ కాకినాడ వచ్చారు.
ఇవి కూడా చదవండి...
భగవంతునికి భక్తుడికి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తా: సుమంత్ రెడ్డి
చిత్తూరులో టీడీపీ నిరసన.. నారాయణ స్వామిని అరెస్ట్ చేయాలంటూ
Read Latest AP News And Telugu News