TDP Protest Chittoor: చిత్తూరులో టీడీపీ నిరసన.. నారాయణ స్వామిని అరెస్ట్ చేయాలంటూ
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:33 PM
అంబేద్కర్ విగ్రహానికి మంటలు ఘటనలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి హస్తం ఉందంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. స్థానిక బొమ్మయపల్లి సర్పంచ్ గోవిందయ్య ఆడిన డ్రామాలో టీడీపీని బలి చేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి చివరకు అతనే అరెస్టయ్యాడని తెలుగు తమ్ముళ్లు పేర్కొన్నారు.
చిత్తూరు, అక్టోబర్ 9: జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చిత్తూరు పార్లమెంట్ టీడీపీ నాయకులు ఈరోజు (బుధవారం) నిరసనకు దిగారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి మంటల ఘటనపై తెలుగుదేశం నేతలు నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం దగ్గర్నుంచి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్, "చుడ " చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతోంది.
అంబేద్కర్ విగ్రహానికి మంటలు ఘటనలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి హస్తం ఉందంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. స్థానిక బొమ్మయపల్లి సర్పంచ్ గోవిందయ్య ఆడిన డ్రామాలో టీడీపీని బలి చేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి చివరకు అతనే అరెస్టయ్యాడని తెలుగు తమ్ముళ్లు పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటించి దళితుల గుండెలను బద్దలు చేసిన వైసీపీ.. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై రిమాండ్‌లో ఉన్న గోవిందయ్యకు సహకరించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని వెంటనే అరెస్టు చేయాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
మెడికల్ కాలేజీలపై వైసీపీకి హైకోర్ట్ షాక్..
మైనారిటీల్లో వెలుగులు, మార్పులకు కారణం ప్రధాని: మంత్రి సత్యకుమార్
Read Latest AP News And Telugu News