YSRCP High Court Case: మెడికల్ కాలేజీలపై వైసీపీకి హైకోర్ట్ షాక్..
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:04 AM
పార్వతీపురం మెడికల్ కాలేజీ పీపీపీ విధానంలో చేపట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఐదేళ్ల పాలనా కాలంలో పార్వతీపురం మెడికల్ కాలేజీకి వైసీపీ అసలు టెండర్లే పిలవని వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అమరావతి, అక్టోబర్ 9: పీపీపీ మెడికల్ కాలేజీల నిర్ణయాలపై హై కోర్టుకు వెళ్లిన వైసీపీ బొక్క బోర్లా పడింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మాణంపై ప్రభుత్వ వాదనను న్యాయస్థానం సమర్థించింది. ప్రభుత్వం విధానం సరైనదే అంటూ వ్యాఖ్యానించింది. మెడికల్ కాలేజీలపై వైసీపీ ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలు కీలకంగా మారాయి. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే తప్పేంటి అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. చలో నర్సీపట్నం నేపథ్యంలో కోర్టు కామెంట్లు.. వైసీపీని డిఫెన్సులోకి నెట్టినట్లైంది.
పార్వతీపురం మెడికల్ కాలేజీ పీపీపీ విధానంలో చేపట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఐదేళ్ల పాలనా కాలంలో పార్వతీపురం మెడికల్ కాలేజీకి వైసీపీ అసలు టెండర్లే పిలవని వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మెడికల్ కాలేజీల నిర్మాణం 13 శాతం మాత్రమే పూర్తి అయ్యిందని వీడియోలు, ఆధారాలతో సహా అధికార పక్షం, ప్రభుత్వం బయటపెట్టింది.
ఉత్తరాంధ్రలో మెడికల్ కాలేజీల కోసం కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రుషి కొండ ప్యాలెస్ కోసం రూ. 500 ఖర్చు పెట్టారని జగన్‌పై టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలంటూ నర్సీపట్నంలో జగన్‌ను దళిత సంఘాలు టార్గెట్ చేశాయి. మెడికల్ కాలేజీల వ్యవహారంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోయి తామే టార్గెట్ అయ్యే పరిస్థితిలోకి వెళ్లింది వైసీపీ.
ఇవి కూడా చదవండి..
వాగు ఉధృతి.. ప్రమాదకరంగా వాగు దాటుతున్న గిరిజనులు
ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన సీఎం
Read Latest AP News And Telugu News