Amaravati: ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన సీఎం
ABN , Publish Date - Oct 09 , 2025 | 06:29 AM
రాష్ట్ర రాజధాని అమరావతిలో మీడియా అవసరాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు...
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతిలో మీడియా అవసరాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. బుఽధవారం ఆయన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. ప్రెస్ క్లబ్ కోసం స్థలం కేటాయించాల్సిందిగా క్లబ్ ప్రతినిధులు అప్పాజీ, సతీశ్ బాబు, నారాయణ తదితరులు కోరారు. 2018లో ఏర్పాటైన ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి.. రాజధాని నిర్మాణంలో పురోభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
చంద్రన్న -2 డిజిటల్ పుస్తకం ఆవిష్కరణ
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ రూపొందించిన మన చంద్రన్న -2 డిజిటల్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం ఆవిష్కరించారు. 2024లో సీఎం అయిన తర్వాత చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించారు.