Onukonda Bridge Demand: వాగు ఉధృతి.. ప్రమాదకరంగా వాగు దాటుతున్న గిరిజనులు
ABN , Publish Date - Oct 09 , 2025 | 10:32 AM
తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామానికి చేరుకోవాలంటే ఈ వాగును దాటాల్సిన పరిస్థితి. దీంతో ప్రమాదకర పరిస్థితిలోనే గిరిజనలు ఒకరికొకరు సాయం చేసుకుని వాగు దాటుతున్నారు.
అల్లూరి జిల్లా, అక్టోబర్ 9: జిల్లాలోని అనంతగిరి మండలం లుంగపర్తి పంచాయతీ ఒనుకొండ గ్రామానికి వెళ్లే రహదారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో సంబంధిత గ్రామాల గిరిజనులు వరద ఉధృతిలో ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు. నిన్న (బుధవారం) కురిసిన భారీ వర్షానికి వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామానికి చేరుకోవాలంటే ఈ వాగును దాటాల్సిన పరిస్థితి. దీంతో ప్రమాదకర పరిస్థితిలోనే ఒకరికొకరు సాయం చేసుకుని వాగు దాటుతున్నారు గిరిజనులు.
ప్రతి ఏడాది వర్షాలు కురిసినప్పుడు ఇదే పరిస్థితి నెలకొంటుందని సమీప గ్రామాల ప్రజలు వాపోతున్నారు. నిత్యావసరాలు, విద్యార్థులు చదువుల కోసం వెళ్లాలంటే ఈ నీటి ప్రవాహాన్ని దాటుకుని వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. అధికారులు తమ గ్రామానికి వెళ్లే రహదారులో వంతెన నిర్మించాలని ఒనుకొండ పరిసర గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. మరి వీరి ఆవేదనపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి..
ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన సీఎం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9పై ఇవాళ హైకోర్టు తీర్పు
Read Latest AP News And Telugu News