Satyakumar Minority Welfare Scheme: మైనారిటీల్లో వెలుగులు, మార్పులకు కారణం ప్రధాని: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:17 PM
కులం మతం చూడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి కుళాయి నీరుని అందిస్తుందరని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆ విధంగా ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలను కులం మతం చూడకుండా పేద మధ్య తరగతి ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.
విజయవాడ, అక్టోబర్ 9: మైనారిటీ మోర్చాలో బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) అన్నారు. గురువారం నాడు బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా సయ్యద్ భాషా ప్రమాణ స్వీకారోత్సవ సభలో మంత్రి మాట్లాడుతూ... నాలుగు సంవత్సరాలుగా మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులుగా బాజీ బీజేపీ పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. అలాగే సోదరులు సయ్యద్ బాషా కూడా పార్టీలో చురుగ్గా పని చేస్తూ విస్తృత స్థాయిలో పని చేస్తారని ఆశిస్తున్నామన్నారు. గతంలో మైనారిటీ వారి పరిస్థితి ఏవిధంగా ఉండేదో ప్రస్తుతం ఏవిధంగా ఉందో తెలుస్తోందని మంత్రి వెల్లడించారు. మైనారిటీ వర్గాల వారికీ సమాజంలో సమాన ప్రాతినిధ్యం కలిగేలా బీజేపీ కృషి చేసిందని చెప్పుకొచ్చారు.
కులం మతం చూడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి కుళాయి నీరుని అందిస్తుందన్నారు. ఆ విధంగా ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలను కులం మతం చూడకుండా పేద మధ్య తరగతి ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. మైనారిటీ పిల్లల చదువు దగ్గర నుంచి ఉద్యోగాలు, పెళ్లి చేసే వరకు ఇలా అనేక సంక్షేమ పథకాలని మైనారిటీ వర్గాల వారికి ఎన్డీఏ ప్రభుత్వం కలిపిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు మైనారిటీ వర్గాల వారిని కేవలం ఓటు బ్యాంక్ వరకు మాత్రమే చూశారని.. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం వారి అభ్యున్నతికి అభివృద్ధికి కృషి చేసిందన్నారు. దేశంలో ఉన్న ప్రజలందరినీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ పని చేస్తున్నారని మంత్రి చెప్పారు.
భర్త వదిలేస్తే వారి పరిస్థితి రోడ్డు మీద పడకుండా మైనారిటీ వారికి ప్రధాని మోదీ కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకున్నారన్నారు. ముస్లిమ్స్ మైనారిటీ జీవితాల్లో ప్రధాని మోదీ వెలుగులు, మార్పులు తీసుకొచ్చారన్నారు. ఈ దేశంలో ప్రధాని మోదీ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కులం మతం చూడకుండా ఒక సేవకుడిలా మాత్రమే పని చేశారని కొనియాడారు. అక్క చెల్లెల్ల ఆత్మ గౌరవం నిలబెట్టేలా ఇంటింటికి మరుగు దొడ్లు నిర్మాణం చేపట్టారన్నారు. మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులుగా బాషా.. బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రతీ అంశాలను అమలు చేసిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
పథకం ప్రకారమే నర్సీపట్నంకు జగన్... ఎమ్మెల్యే ఫైర్
మెడికల్ కాలేజీలపై వైసీపీకి హైకోర్ట్ షాక్..
Read Latest AP News And Telugu News