Share News

Nakka Anand Lashes Out Jagan: పథకం ప్రకారమే నర్సీపట్నంకు జగన్... ఎమ్మెల్యే ఫైర్

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:20 AM

మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి జగన్ అని నక్కా ఆనంద్ బాబు అన్నారు. కరోనా సమయంలో వేలాది మందిని చంపేశారని మండిపడ్డారు. మాస్కులు అడిగితే పిచ్చొడని చెప్పి డా.సుధాకర్‌ను చంపేశారన్నారు.

Nakka Anand Lashes Out Jagan: పథకం ప్రకారమే నర్సీపట్నంకు జగన్... ఎమ్మెల్యే ఫైర్
Nakka Anand Lashes Out Jagan

అమరావతి, అక్టోబర్ 9: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు (MLA Nakka Anand Babu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం వద్ద నిధులు లేనప్పుడు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే తప్పేంటి... నీకు వచ్చిన నొప్పేంటి జగన్మోహన్ రెడ్డి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలపై హైకోర్టు చెప్పినప్పటికీ.. జగన్ సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విశాఖకు, నర్సీపట్నంకు పులోమని బయలుదేరారన్నారు. అల్లర్లు, అలజడులు సృష్టించడం కోసం నర్సీపట్నం పథకం ప్రకారం వెళ్తున్నారని... సిగ్గు లజ్జా లేని వ్యక్తి జగన్ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే.


మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి జగన్ అన్నారు. కరోనా సమయంలో వేలాది మందిని చంపేశారని మండిపడ్డారు. మాస్కులు అడిగితే పిచ్చొడని చెప్పి డా.సుధాకర్‌ను చంపేశారన్నారు. ‘నువ్వేం వెలగబెట్టావని చూడటానికి పోతున్నావ్ జగన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో పేద వాడికి వైద్య విద్యను, వైద్యాన్ని కారు చౌకగా అందించాలని, ఉచితంగా పేద పిల్లలకు మెడికల్ సీట్లు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రభుత్వం పీపీపీ విధానానికి వెళ్తుంటే దాన్ని విమర్శిస్తున్నావ్. కోర్టు తీర్పుతో అయినా జగన్‌కు కనువిప్పు కలగాలి. పేదల అభివృద్ధికి అడ్డుగోడగా మారిన పెత్తందారు జగన్మోహన్ రెడ్డి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.


పీపీపీ విధానంతో వేగవంతంగా నిర్మించేలా ప్రభుత్వం కృషి చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్న దుర్మార్గుడు జగన్. అంటూ విరుచుకుపడ్డారు. జగన్.. సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. 11 సీట్లు ఇచ్చినా.. ఇంకా సిగ్గు రాలేదన్నారు. ‘వైనాట్ 175 అన్నావ్ 11 యే నీకు ఎక్కువ అని ప్రజలు తీర్పు ఇచ్చారు’ అని అన్నారు. అభివృద్ధి సంక్షేమమే అజెండాగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అల్లర్లు సృష్టించి అడ్డుకుంటున్నారని... తప్పుడు ప్రచారాలతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు జగన్‌ను ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. ఇంకా ఇలాగే చేస్తే ప్రజలు తరిమికొడతారని.. జగన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకో అంటూ నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

మెడికల్ కాలేజీలపై వైసీపీకి హైకోర్ట్ షాక్..

వాగు ఉధృతి.. ప్రమాదకరంగా వాగు దాటుతున్న గిరిజనులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 09 , 2025 | 11:36 AM