Minister Lokesh: సమస్యలపై చర్చించి పరిష్కరించుకుందాం
ABN , Publish Date - Oct 09 , 2025 | 06:26 AM
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకుందామని...
ఇక ఫలితాలపై దృష్టి పెడదాం: ఉపాధ్యాయులతో మంత్రి లోకేశ్
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకుందామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ టీచర్లతో అన్నారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, నోబుల్ టీచర్ల సంఘం ప్రతినిధులు, భాషా పండితులతో మంత్రి సమావేశమయ్యారు. పదోన్నతుల సమస్య పరిష్కరించినందుకు భాషా పండితులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. సంస్కరణలకాలం ముగిసిందని,ఇక ఫలితాలపై దృష్టిపెడతామని చెప్పారు.