Chandrababu Tribute to Ratan Tata: రతన్ టాటా.. స్పూర్తి ప్రదాత: చంద్రబాబు
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:31 PM
దివంగత పారిశ్రామిక వేత్త రతన్ టాటా వర్ధంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవల్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. రతన్ వారసత్వం భవిష్యత్ తరాలకు..
అమరావతి, అక్టోబర్ 9: భారతమాత ముద్దుబిడ్డ, దివంగత భారత పారిశ్రామిక వేత్త రతన్ టాటా వర్ధంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవల్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఉదయం తన సోషల్ మీడియా అకౌంట్ 'ఎక్స్' ఖాతాలో చేసిన ఒక పోస్ట్‌లో రతన్ టాటాను స్మరించుకున్నారు.
'శ్రీ రతన్ టాటా మృతి చెంది ఏడాదవుతోంది. ఆయన పారిశ్రామిక దిగ్గజం. కరుణామయ మానవతావాది, ఒక దార్శనికుడు, ఆయన వారసత్వం భవిష్యత్ తరాలకు శాశ్వతంగా స్ఫూర్తినిస్తుంది.. యువతకు మార్గనిర్దేశం చేస్తుంది.' అని చంద్రబాబు అన్నారు. తన పోస్ట్ కు రతన్ టాటా ఫొటోను కూడా జత చేశారు చంద్రబాబు.
కాగా, రతన్ టాటా (1937-2024)టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజం. ఆయన అక్టోబర్ 9, 2024 న పరమపదించారు. రతన్ టాటా భారత దేశానికి చేసిన సేవలు, దాతృత్వం, ఆవిష్కరణలు భారత దేశం మొత్తం ఆయన్ను ఎల్లకాలం స్మరించుకునే స్థాయికి తీసుకెళ్లాయి.
ఇవి కూడా చదవండి..
ఈ కార్మికులు చాలా తెలివైన వాళ్లు.. బస్తాను పైకి ఎలా పంపుతున్నారో చూడండి..
ఈ ఫొటోలో రెండో కారు కూడా ఉంది.. ఎక్కడ.. 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..