Share News

Sumanth Reddy TTD: భగవంతునికి భక్తుడికి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తా: సుమంత్ రెడ్డి

ABN , Publish Date - Oct 09 , 2025 | 02:03 PM

ఢిల్లీలో స్వామి వారి భక్తులకు ఎప్పటికప్పుడు స్వామివారి కార్యక్రమాలు తెలియజేస్తానని.. తిరుమలలో స్వామివారికి జరిగే కైంకర్యాలు ఢిల్లీ టీటీడీ ఆలయంలో జరిగేలా చూస్తానని సుమంత్ రెడ్డి వెల్లడించారు.

Sumanth Reddy TTD: భగవంతునికి భక్తుడికి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తా: సుమంత్ రెడ్డి
Sumanth Reddy TTD

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఢిల్లీ టీటీడీ లోకల్ అడ్బైజరీ కమిటీ అధ్యక్షుడిగా ఎదుగుండ్ల సుమంత్ రెడ్డి (Delhi TTD Local Advisory Committee Chairman Sumanth Reddy) ఈరోజు (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సుమంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తానని అన్నారు. ఢిల్లీ టీటీడీ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.


ఢిల్లీలో స్వామి వారి భక్తులకు ఎప్పటికప్పుడు స్వామివారి కార్యక్రమాలు తెలియజేస్తానని.. తిరుమలలో స్వామివారికి జరిగే కైంకర్యాలు ఢిల్లీ టీటీడీ ఆలయంలో జరిగేలా చూస్తానని వెల్లడించారు. తెలుగువారు, శ్రీవారి భక్తులతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఆలయానికి కావలసిన వసతులు ఏర్పాటు చేస్తానన్నారు. ఏపీ భవన్‌లో టీటీడీ కౌంటర్ మళ్ళీ అందుబాటులోకి తీసుకువస్తానని సుమంత్ రెడ్డి పేర్కొన్నారు.


అలా చేస్తే ఉపేక్షించం: మాధవ్

కాగా.. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని టీటీడీ లోకల్ అడ్వైజర్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సుమంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి వైభవాన్ని తెలియజేసే విధంగా టీటీడీ అనేక రకాల దేవాలయాలను నిర్మిస్తోందన్నారు. తిరుమల తిరుపతిలో శ్రీవారికి ఎలాంటి సేవలు జరుగుతాయో ఢిల్లీలో కూడా అలాంటి సేవలు కొనసాగిస్తామని వెల్లడించారు. ఏపీ భవన్‌లో ఉన్న టీటీడీ దర్శన కౌంటర్‌ను తిరిగి పున ప్రారంభిస్తామని ప్రకటించారు. టీటీడీ పవిత్రకు ఎక్కడ భంగం కలిగించిన ఉపేక్షించే పనిలేదని స్పష్టం చేశారు. టీటీడీ వైభవం మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. టీటీడీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ కృషి చేస్తోందని మాధవ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

మైనారిటీల్లో వెలుగులు, మార్పులకు కారణం ప్రధాని: మంత్రి సత్యకుమార్

చిత్తూరులో టీడీపీ నిరసన.. నారాయణ స్వామిని అరెస్ట్ చేయాలంటూ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 09 , 2025 | 02:03 PM