Ayesha Meera case: ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ విచారణ
ABN, Publish Date - Jun 20 , 2025 | 07:31 PM
ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో దర్యాప్తు పూర్తిచేశామని సీబీఐ అధికారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌కి నివేదించారు. విజయవాడ కోర్టులో ఇవాళ ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు.
అమరావతి: ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో (Ayesha Meera case) సీబీఐ (CBI) అధికారుల విచారణ ముగిసింది. ఏడేళ్ల నుంచి సీబీఐ అధికారులు ఈ కేసుని విచారణ చేశారు. 2018లో పున: విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. మొదట సిట్‌కి హైకోర్ట్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. సిట్ దర్యాప్తులో పురోగతి లేదని, సీబీఐ విచారణ చేయాలని హైకోర్ట్ ఆదేశించింది. ఇవాళ(శుక్రవారం) విచారణ పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో సీబీఐ అధికారులు హైకోర్టుకి అందజేశారు. అయితే సీబీఐ కోర్టులో నివేదిక కాపీ అందించాలని సీబీఐకి హైకోర్ట్ ఆదేశించింది. ఈ కేసుని వచ్చే వారానికి ఏపీ హైకోర్ట్ విచారణ వాయిదా వేసింది.
కాగా, ఆయేషా మీరా హత్య కేసులో దర్యాప్తు పూర్తిచేశామని సీబీఐ అధికారులు హైకోర్ట్‌కి నివేదించారు. విజయవాడ కోర్టులో ఇవాళ ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఫైనల్ రిపోర్ట్ వేసేందుకు హైకోర్ట్ అనుమతించింది. సీల్డ్ కవర్లో ఫైనల్ రిపోర్ట్ కాపీలను హైకోర్ట్‌కి సీబీఐ అధికారులు సమర్పించారు. వాటిని భద్రపరచాలని రిజిస్ట్రీకి ఏపీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడలోని ఓ హాస్టల్‌లో 17 ఏళ్ల అయేషా మీరా అనే ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన 2007 డిసెంబర్27వ తేదీన జరిగింది. తాను ఉంటున్న హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో కత్తిపోట్లతో ఆయేషా మీరా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన సంచలనంగా మారింది. కాగా ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్ పార్టీ
ఘోర రోడ్డుప్రమాదం.. తొమ్మిది మంది మృతి
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 20 , 2025 | 09:24 PM