Seeds Still Awaited: ఖరీఫ్ ప్రణాళిక ఖరారెప్పుడో
ABN, Publish Date - May 12 , 2025 | 03:38 AM
ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్నా విత్తనాల ప్రణాళిక తీరక రైతులు అసహనంతో ఎదురుచూస్తున్నారు. వేసవి దుక్కులతో పొలాలు సిద్ధం చేసినా, విత్తనాల లేవు సాగుపై అనిశ్చితి కలిగిస్తోంది
దుక్కులతో రైతులు సిద్ధం.. విత్తనాల కోసం ఎదురుచూపులు
అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): మరో కొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి రానున్నాయి. వెంటనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నది. అయినా ఇంత వరకు ఖరీఫ్ పంటల ప్రణాళిక ఖరారు కాలేదని తెలిసింది. కనీసం సీజన్‌కు సరిపడా విత్తనాలను కూడా రైతులకు అందుబాటులోకి తేలేదు. సాధారణంగా ఈపాటికే విత్తన ప్రణాళిక సిద్ధం కావాల్సి ఉంది. ఇంత వరకు జిల్లాలు, మండలాలకు కూడా పచ్చిరొట్ట విత్తనాలు అధికారులు సరఫరా చేయలేదని సమాచారం. అకాల వర్షాలు కలిసొచ్చి గ్రామాల్లో వేసవి దుక్కులతో రైతులు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఖరీఫ్ పంటలకు ఎరువులుగా ఉపయోగపడే పచ్చి రొట్ట విత్తనాలు ముందుగా అందిస్తే తొలకరి వర్షాలకు వేసి, తర్వాత భూమిలో కలియదున్ని, జూన్- జూలైలో పూర్తిస్థాయి సాగుకు సిద్ధపడుతున్నారు. అందువల్ల సీజన్ ప్రారంభమయ్యే నాటికే రైతుల దగ్గర విత్తనాలు ఉంటే మంచి వర్షాలు కురినప్పుడు ఎదలకు అవకాశం ఉంటుందని అంటున్నారు. జూన్‌లోనే సాగునీరు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతులు ఏటా మూడు పంటలు పండించాలని సూచించింది. ప్రభుత్వ సూచనల ప్రకారం అధికారులు వెంటనే విత్తనాలను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. అప్పటికప్పుడు విత్తనాలు పంపితే పంపిణీ చేయడం కష్టమవుతుందని క్షేత్రస్థాయి అధికారులు కూడా అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు
Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు
Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..
Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన
Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్
For Andhrapradesh news and Telugu News
Updated Date - May 12 , 2025 | 03:38 AM