ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Satyakumar: 2047 నాటికి ప్ర‌పంచంలో రెండో స్థానానికి భార‌త్ ఎద‌గ‌డం ఖాయం

ABN, Publish Date - May 25 , 2025 | 09:23 PM

Minister Satyakumar: 2047 నాటికి ప్ర‌పంచంలో అతిపెద్ద లేదా రెండో స్థానానికి భార‌త్ ఎద‌గ‌డం ఖాయ‌మ‌ని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఆ దిశ‌గా దేశ ప్ర‌జ‌లంతా ఉమ్మ‌డిగా కృషి చేసి విక‌సిత భార‌తావ‌ని ఆవిష్కారానికి కృషి చేయాల‌ని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.

Minister Satyakumar Yadav

అమ‌రావ‌తి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నాయ‌క‌త్వంలో భార‌తదేశం నిరంత‌రంగా ఎదుగుతోందని ఏపీ వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ (Minister Satyakumar Yadav) తెలిపారు. సామాజిక మాధ్య‌మం ఎక్స్ వేదిక‌గా వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ట్వీట్‌ చేశారు. భార‌త దేశం జ‌పాన్‌ను అధిగ‌మించి ప్ర‌పంచంలో నాల్గో శ‌క్తివంత‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా నిలిచింద‌న్న అధికారిక ప్ర‌క‌ట‌న‌పై మంత్రి స‌త్య‌కుమార్ హ‌ర్షం వ్యక్తం చేశారు.


త్వ‌ర‌లో జ‌ర్మ‌నీని కూడా అధిగ‌మించి ప్ర‌పంచంలో అతి పెద్ద మూడో ఆర్థిక శ‌క్తిగా భార‌త‌దేశం నిలుస్తుందని మంత్రి స‌త్య‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లను స్వీక‌రించిన‌ప్పుడు ప్ర‌పంచంలో 11వ స్థానంలో మ‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఉందని చెప్పుకొచ్చారు. నిరంత‌రం ప్ర‌గ‌తి మార్గంలో ప‌య‌నించ‌డానికి ప్ర‌ధాని మోదీ నాయ‌క‌త్వంలో టీమ్ ఇండియా చేసిన కృషే కార‌ణమని మంత్రి స‌త్య‌కుమార్ ఉద్ఘాటించారు.


2047 నాటికి ప్ర‌పంచంలో అతిపెద్ద లేదా రెండో స్థానానికి భార‌త్ ఎద‌గ‌డం ఖాయ‌మ‌ని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఆ దిశ‌గా దేశ ప్ర‌జ‌లంతా ఉమ్మ‌డిగా కృషి చేసి విక‌సిత భార‌తావ‌ని ఆవిష్కారానికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. విజ‌య‌వంత‌మ‌వుతున్న ఈ ప్ర‌యాణానికి దిశ‌, నిర్దేశాలు చూపుతున్న ప్ర‌ధాని మోదీకి మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అభినంద‌న‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం

పండుగలా సీఎం చంద్రబాబు గృహప్రవేశం

For More AP News and Telugu News

Updated Date - May 25 , 2025 | 09:27 PM