ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Narayana: ప్రధాని ఏపీ పర్యటన.. అధికారులకు మంత్రి నారాయణ సూచనలు

ABN, Publish Date - Apr 24 , 2025 | 09:28 AM

Minister Narayana: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీలో మే2వ తేదీన పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి పనుల్లో మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు.

Minister Narayana

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే2వ తేదీన రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. ఇవాళ(గురువారం) సభ ఏర్పాటు చేసే వేదికను మంత్రి నారాయణ, అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని తెలిపారు. మే 2వ తేదీన మోదీ రాకకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రధాని పర్యటన సందర్భంగా 8 రోడ్డులను పోలీస్‌ అధికారులు గుర్తించారని.. ఎక్కడ ట్రాఫిక్ జామ్ నెలకొనకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ అన్నారు.


ప్రధాని సభ కోసం వచ్చే వారు వాహనాలు పార్కింగ్ చేయడానికి 11 ప్రాంతాలను గుర్తించామని మంత్రి నారాయణ తెలిపారు. వైసీపీ హయాంలో గత ఐదు సంవత్సరాలు అమరావతి రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. కనీసం ముగ్గురు, నలుగురు అమరావతి రైతులను పిలిచి సన్మానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారని అన్నారు. ప్రధాని కేవలం గంటన్నర మాత్రమే అమరావతి పర్యటన కోసం సమయం ఇచ్చారని తెలిపారు. ప్రధాని మోదీ భద్రత దృష్ట్యా పటిష్ట చర్యలు చేపడుతున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.


అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నామని మంత్రి నారాయణ చెప్పారు. ప్రజలు ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరిస్తే చేస్తామని.. లేకపోతే భూసేకరణ విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. హైదరాబాద్‌లో గతంలో ఒక ఎయిర్‌పోర్ట్ ఉండేదని... అయినా శంషాబాద్ నిర్మించారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఇప్పుడు రెండో ఎయిర్‌పోర్ట్ లేకపోతే పదిశాతం విమానాలు కూడా దిగేవి కావని అన్నారు. రానున్న 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ACB: మాజీ మంత్రి విడదల రజని మరిది అరెస్టు..

Terror Attack: ఉగ్రదాడిలో అసువులుబాసిన నెల్లూరు జిల్లా వాసి.. మరికాసేపట్లో కావలికి మృతదేహం..

For More AP News and Telugu News

Updated Date - Apr 24 , 2025 | 10:18 AM