AP NEWS: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌కు సుప్రీంకోర్టు షాక్
ABN, Publish Date - Jul 30 , 2025 | 11:32 AM
ఏపీ సీబీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. సంజయ్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ గైర్హాజరవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమరావతి: ఏపీ సీబీసీఐడీ మాజీ చీఫ్ సంజయ్ (Former AP CBCID Chief Sanjay) ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ రేపటికి (గురువారం) వాయిదా పడింది. సంజయ్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ గైర్హాజరవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంజయ్‌కి ముందస్తు బెయిల్ ఇస్తూ 49 పేజీల తీర్పును రాసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై గత విచారణ సందర్భంగా జస్టిస్ అమానుల్లా ధర్మసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్‌ను పూర్తి చేసినట్లు ఉందని ధర్మాసనం తెలిపింది.
కపిల్ సిబాల్ రానందున విచారణను వాయిదా వేయాలని సంజయ్ తరపు జూనియర్ లాయర్ న్యాయస్థానాన్ని కోరారు. గతంలో కూడా ఇలాగే జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ఏఎస్ రాజు తీసుకువచ్చారు. ఇవాళ (బుధవారం జులై 30) విచారణ వాయిదా వేయడానికి ముందు ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసు విచారణలో తీవ్ర జాప్యం కోసం ప్రయత్నిస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ఏఎస్ రాజు సుప్రీంకోర్టుకు తెలిపారు. కపిల్ సిబాల్ రేపు(గురువారం) సుప్రీంకోర్టులో వాదనలకు హాజరు కావాలని, లేకపోతే వేరే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సంజయ్‌కి న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
లిక్కర్ కుంభకోణంలో సంచలనం.. విచారణలో సిట్ దూకుడు
సింగపూర్‌లో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్.. పెట్టుబడులపై కీలక చర్చలు
Read latest AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 30 , 2025 | 01:47 PM