ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TDP Mahanadu:టీడీపీ మహానాడుకు 19 కమిటీల ఏర్పాటు

ABN, Publish Date - May 20 , 2025 | 01:07 PM

TDP Mahanadu: కడపలో ఈ ఏడాది మహానాడు నిర్వాహణకు 19 కమిటీలను తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలను నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు.

TDP Mahanadu

అమరావతి: కడప వేదికగా ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మహానాడు (TDP Mahanadu) నిర్వహించాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) నిర్ణయం తీసుకున్నారు. కడపలో ఈ ఏడాది మహానాడు నిర్వాహణకు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలను నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు.


బాధ్యతలు అప్పగించిన నేతలు వీరే..

  • ఆహ్వాన కమిటీ కన్వీనర్లుగా పల్లా శ్రీనివాసరావు, బక్కనీ నరసింహులు

  • సమన్వయ కమిటీ కన్వీనర్‌గా నారా లోకేష్

  • తీర్మానాల కమిటీ కన్వీనర్‌గా యనమల రామకృష్ణుడు

  • వసతి ఏర్పాట్లు కన్వీనర్‌గా కింజరాపు అచ్చెన్నానాయుడు

  • సభా నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కింజరాపు రామ్మోహన్ నాయుడు

  • భోజనాలు కమిటీ కన్వీనర్‌గా బీసీ జనార్దన్ రెడ్డి

  • మీడియా కమిటీ కన్వీనర్‌గా NMD ఫరూక్

  • ఆర్థిక వనరుల కమిటీ కన్వీనర్‌గా అనగాని సత్యప్రసాద్

  • సాంస్కృతిక శాఖ కార్యక్రమాల కమిటీ కన్వీనర్‌గా కొండపల్లి శ్రీనివాస్

  • ఫొటో ప్రదర్శన కమిటీ కన్వీనర్‌గా ఆనం రామనారాయణ రెడ్డి

  • ప్రతినిధుల నమోదు కమిటీ కన్వీనర్‌గా చింతకాయల విజయ్

  • సభా ప్రాంగణ పరిరక్షణ కమిటీ కన్వీనర్‌గా నిమ్మల రామానాయుడు

  • అలంకరణ కమిటీ కన్వీనర్‌గా పులివర్తి నాని

  • రవాణా కమిటీ కన్వీనర్‌గా పొంగూరు నారాయణ

  • వాహన పార్కింగ్ కన్వీనర్‌గా మంతెన రామరాజు

  • మెడికల్ క్యాంప్ కన్వీనర్‌గా డోలా బాల వీరాంజనేయ స్వామి

  • వలంటీర్ల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కొల్లు రవీంద్ర

  • జన సమీకరణ కమిటీ కన్వీనర్‌గా గొట్టిపాటి రవికుమార్

  • సుందరీకరణ, పరిశుభ్రత కమిటీ కన్వీనర్‌గా వాసంశెట్టి సుభాష్


పసుపుమయంగా ఎన్టీఆర్ జిల్లా..

పసుపుమయంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం మారింది. మైలవరం శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో మైలవరం నియోజకవర్గం స్థాయిలో ఇవాళ(మంగళవారం) మినీ మహానాడు నిర్వహించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహానాడుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు గజమాలతో తెలుగు యువత అధ్యక్షుడు లంకా లితిష్ ఘన స్వాగతం పలికారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడారు.


మైలవరం నియోజకవర్గంలో ఎవరు గ్రూపులు కట్టొద్దు: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

‘నేను పార్టీ వాడిని, మైలవరం నియోజకవర్గంలో ఎవరు గ్రూపులు కట్టొద్దు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం. ఏపీ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కట్టుబడి ఉన్నారు. జగన్ హయాంలో మద్యం స్కాం అక్షర సత్యం. నాసిరకం మద్యంతో ప్రజలను దోచుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి అభివృద్ధిలో జగన్ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కు తీసుకువెళ్లారు. వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్ విభజన అమలు కానుంది. 2029లో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుంది. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది’ అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Education Department: మోడల్‌ స్కూల్స్‌ కాంట్రాక్టు టీచర్ల రెన్యువల్‌

Kuppam: రేపు కుప్పం రానున్న చంద్రబాబు

APSRTC: పీటీడీ ఉద్యోగులకు ఏఏఎస్‌ అమలుపై మార్గదర్శకాలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 20 , 2025 | 01:25 PM