APSRTC: పీటీడీ ఉద్యోగులకు ఏఏఎస్ అమలుపై మార్గదర్శకాలు
ABN , Publish Date - May 20 , 2025 | 06:17 AM
పీటీడీ ఉద్యోగులకు ఏఏఎస్ అమలుపై ఆర్టీసీ కీలక మార్గదర్శకాలు విడుదల చేశాయి. పదోన్నతి లేనిపక్షంలో 6 సంవత్సరాల సేవ తర్వాత ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు.
విజయవాడ(బస్‌స్టేషన్), మే 19(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణాశాఖ (పీటీడీ)ఉద్యోగులకు ఆరు సంవత్సరాల సేవకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (ఏఏఎస్) అమలుపై రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సోమవారం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉద్యోగులు ఒకే పదవిలో ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత కూడా పదోన్నతులకు నోచుకోకపోతే వారిని ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉద్యోగికి జోన్‌లో అర్హతగల పదోన్నతి లేకపోయినా, ఆసక్తి చూపకపోయినా.. తనకన్నా జూనియర్లు పదోన్నతి పొందని పరిస్థితుల్లో అర్హతలు ఉన్న ఉద్యోగికి ఏఏఎస్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇంకా పలు అంశాలపై స్పష్టత ఇస్తూ చీఫ్ పర్సనల్ మేనేజర్, బోర్డు సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.