Share News

Education Department: మోడల్‌ స్కూల్స్‌ కాంట్రాక్టు టీచర్ల రెన్యువల్‌

ABN , Publish Date - May 20 , 2025 | 07:01 AM

మోడల్‌ స్కూల్స్‌లో 282 కాంట్రాక్టు టీచర్ల సేవలను విద్యాశాఖ రెన్యువల్‌కు అనుమతి ఇచ్చింది. టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి, మొదటి రోజున 62.32% హాజరయ్యారు; బోధనేతర సిబ్బంది బదిలీలకూ అనుమతి లభించింది.

Education Department: మోడల్‌ స్కూల్స్‌ కాంట్రాక్టు టీచర్ల రెన్యువల్‌

అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి):మోడల్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న 282 మంది కాంట్రాక్టు టీచర్ల సేవలను రెన్యువల్‌ చేసేందుకు అనుమతి ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 211 మంది పీజీటీలు, 71 మంది టీజీటీల రెన్యువల్‌కు అనుమతిచ్చింది.

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు పరీక్షకు 35,686 మంది విద్యార్థులకుగాను 22,238 (62.32శాతం) మంది హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు తెలిపారు.

విద్యాశాఖలో బోధనేతర సిబ్బందికి బదిలీలు

పాఠశాల విద్యాశాఖలోని బోధనేతర సిబ్బంది బదిలీలు చేపట్టేందుకు అనుమతి ఇస్తూ ఆ శాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బదిలీలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

Updated Date - May 20 , 2025 | 07:03 AM