Amaravati: రాజధాని అమరావతిపై మరోసారి విష ప్రచారం.. పోలీసులు సీరియస్
ABN, Publish Date - Jul 07 , 2025 | 01:01 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై కొంతమంది పనిగట్టుకొని విష ప్రచారానికి దిగుతున్నారు. అమరావతిపై ఇప్పటివరకు వైసీపీ నేతలు విష ప్రచారం చేయగా.. ఇప్పుడు వారి సానుభూతిపరులతో కూడా అమరావతిపై విషం చిమ్ముతున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై (AP Capital Amaravati) కొంతమంది పనిగట్టుకొని విష ప్రచారానికి దిగుతున్నారు. అమరావతిపై ఇప్పటివరకు వైసీపీ నేతలు (YSRCP Leaders) విష ప్రచారం చేయగా.. ఇప్పుడు వారి సానుభూతిపరులతో కూడా విషం చిమ్ముతున్నారు. అయితే.. రాజధానిలో తాజాగా భూ సమీకరణ చేపట్టాల్సిన గ్రామాలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇటీవల 8 గ్రామాల్లో మలివిడత భూసమీకరణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా రాజధానిలోని తుళ్లూరు మండలం పెదపరిమిలో ఒక రైతు ప్రచారం చేస్తున్నాడు.
సైకిల్‌కు మైక్ కట్టుకుని భూసమీకరణకు భూములు ఇవ్వవద్దని అంటున్నాడు. ఇప్పటికే భూములు ఇచ్చిన తుళ్లూరు మండలం రైతులు అభివృద్ధి లేక అల్లాడుతున్నారని మైక్‌లో చెబుతున్నాడు. అన్నదాతలకు ఇచ్చిన ప్లాట్లు ఎక్కడో కూడా నేటి వరకు తెలియదని చెబుతూ ప్రచారం చేస్తున్నాడు. అలాంటప్పుడు రైతులు భూములు ఇచ్చి ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తూ.. ఆ వ్యక్తి ప్రచారానికి దిగాడు. ఇది కావాలనే చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారమని అధికారులు చెబుతున్నారు. ప్రచారం చేస్తున్న వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అమరావతిపై విష ప్రచారం చేస్తున్న వ్యక్తిపై పోలీసులు సీరియస్ అయ్యారు. సదరు వ్యక్తి వైసీపీ సానుభూతిపరుడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతిపై ఫేక్ ప్రచారానికి దిగడంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
మామిడి కొనుగోలుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Read latest AP News And Telugu News
Updated Date - Jul 07 , 2025 | 01:09 PM