ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: వివేక హత్య కేసులో కుట్ర కోణం బయటపెడతాం

ABN, Publish Date - Mar 25 , 2025 | 08:45 PM

CM Chandrababu: నేరస్తుల గుర్తింపు, తక్షణం శిక్ష పడేలా చేయడంలో క్లూస్ టీం కీలక పాత్ర పోషించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. నేరం జరిగిన ప్రాంతాన్ని ముందుగా ప్రొటక్ట్ చేసి సాక్ష్యాలు చెరిగిపోకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

అమరావతి: లా అండ్ ఆర్డర్ పై ఎస్పీలు, కలెక్టర్లతో ఇవాళ(మంగళవారం) ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణపై పోలీసు శాఖ ప్రజెంటేషన్ ఇచ్చింది. టెక్నాలజీ ద్వారా కేసుల పరిష్కారం, నేరస్తులను శిక్షించడంలో అనుసరిస్తున్న విధానాలను పోలీసు అధికారులు వివరించారు. డిజిటల్ అరెస్టులు, కొత్త తరహా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. నేరస్తులను గుర్తించే విషయంలో సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించాలని సీఎం చంద్రబాబు అన్నారు.


క్రైం సీన్ జరిగిన ప్రాంతంలో సాక్ష్యాలను సేకరించే విషయంలో కొత్త పద్ధతులను అనుసరించాలని సూచించారు. నేరస్తులు చాలా తెలివైన వాళ్లు...సాక్ష్యాలు దొరకకుండా అనేక మాయలు చేస్తారు...విచారణ అధికారులు మరింత చురుగ్గా, తెలివిగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అన్నారు. నేరాలు చేసి పారి పోయేవారు కొందరైతే...నేరాలు చేసి పక్క వారిపై నెట్టేవారు మరి కొంతమంది ఉన్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.


మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఒక్కటి చూస్తే నేరాల విషయంలో పెద్ద కేస్ స్టడీ అంటూ సీఎం చంద్రబాబు తెలిపారు. వివేకా హత్య విషయంలో తీసుకున్న మలుపులు మనం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణ విషయంలో ఎస్‌వోపీ ద్వారా పక్కాగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. నేరస్తుల గుర్తింపు, తక్షణం శిక్ష పడేలా చేయడంలో క్లూస్ టీం కీలక పాత్ర పోషించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. నేరం జరిగిన ప్రాంతాన్ని ముందుగా ప్రొటక్ట్ చేసి సాక్ష్యాలు చెరిగిపోకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలీస్ శాఖకు అవసరమైన పోలీస్ డాగ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 08:50 PM